మా బంగ్లా పేరు సీక్రెట్‌ అదే! : నటి | Sonakshi Sinha Revealed Her Family Secret In A Singing Show | Sakshi
Sakshi News home page

మా బంగ్లా పేరు వెనుక ఉన్న సీక్రెట్‌ అదే!!

Published Fri, Aug 10 2018 1:30 PM | Last Updated on Fri, Aug 10 2018 1:45 PM

Sonakshi Sinha Revealed Her Family Secret In A Singing Show - Sakshi

సోనాక్షి సిన్హా

‘ఈ రోజు మీ కోసం ఆ రహస్యాన్ని చెప్పేస్తున్నా. మా నాన్న పేరు మీకందరికీ తెలిసిందే.’

ముంబై : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా గారాల పట్టి, బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా తమ బంగ్లా పేరు వెనుక ఉన్న సీక్రెట్‌ చెప్పేశారు. ‘దబంగ్‌’  సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సరైన హిట్లులేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ సింగింగ్‌ షోకి గెస్ట్‌గా హాజయ్యారు సోనాక్షి. ఇందిరా దాస్‌ అనే కంటెస్టెంట్‌ ప్రతిభకు ముగ్ధురాలైన సోనాక్షి.. ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ఇందిరా దాస్‌, ఆమె తల్లితో సోనాక్షి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మీ బంగ్లాకు రామాయణ్‌ అనే పేరు ఎందుకు పెట్టారంటూ’  ఇందిర తల్లి సోనాక్షిని అడిగారు.

‘ఎన్నో ఏళ్లుగా, ఎంతో మంది ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. కానీ ఈ రోజు మీ కోసం ఆ రహస్యాన్ని చెప్పేస్తున్నా. మా నాన్న పేరు మీకందరికీ తెలిసిందే. ఆయన అన్నదమ్ముల పేర్లు... రామ్‌, లక్ష్మన్‌, భరత్‌. ఇక నా అన్నదమ్ములు లవ్‌, కుశ. కాబట్టి రామాయణ్‌ అనే పేరు మా బంగ్లాకు సరిగ్గా సరిపోతుందని కుటుంబ సభ్యులు భావించారు. అందుకే ఆ పేరు పెట్టారు. ఈ రకంగా చూస్తే మా ఇంట్లో నేను, మా అమ్మే(పూనం) బయటివాళ్లం అన్పిస్తోంది కదా. కానీ ఒక్కోసారి మహాభారత సంఘటనలు(యుద్ధం) కూడా ‘రామాయణ్‌’లో సృష్టించగల సత్తా మాకుంది’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement