
హీరోలు.. హీరోయిన్స్‌కి అభిమానులుండటం కామన్. వీలైతే వారిని కలవాలని, కుదిరితే ఓ ఫొటో దిగాలని ఫ్యాన్స్ ఆరాట పడుతుంటారు. కానీ, ఓ హీరోకి మరో హీరోయిన్ అభిమాని అయితే.. తనని కలిసే అవకాశం కోసం ఎన్నో ఏళ్ల నుంచో వేచి చూస్తుంటే.. ఆ అవకాశం రానే వస్తే? ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా అదే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారట.
ఈ సంతోషం అంతా తన ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్‌ని కలిసినందుకే. ఆరడుగుల అందగాడితో ఈ మిల్కీ బ్యూటీ ఫొటో దిగారు కూడా. ‘‘నా సినిమా కెరీర్ బిగినింగ్ నుంచి హృతిక్‌ను కలవాలనుకుంటున్నా. నన్ను బాగా ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తుల్లో హృతిక్ ఒకరు. ఇన్నేళ్ల తర్వాత నా అభిమాన హీరోని కలవడం, మాట్లాడటం సో హ్యాపీ.
హృతిక్‌ని కలిసిన ఆ క్షణం, కలిసి తీయించుకున్న ఫొటో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ మధురమైన జ్ఞాపకాన్ని నాకు మిగిల్చినందుకు థ్యాంక్స్’’ అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు తమన్నా.. ‘‘నిన్ను కలిసినందుకు నాకూ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యూ తమన్నా’’ అని హృతిక్ బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment