
...అంటున్నారు హృతిక్ రోషన్. ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారేమోనని పొరపాటు పడకండి. ఎందుకంటే ఆయన బీహార్‌కు చెందిన ఆనంద్‌కుమార్ బయోపిక్‌లో నటించబోతున్నారు. ఆనంద్‌కుమార్ ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదూ! ‘సూపర్30’ ప్రోగ్రామ్ ద్వారా ఎందరో పేద విద్యార్థులకు ప్రముఖ ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) సంస్థల్లో ఆడ్మిషన్ పొందేలా కృషి చేస్తున్న మ్యాథమ్యాటిషియన్ ఆనంద్‌కుమార్. రీల్‌పై ఆనంద్‌కుమార్‌గా కనిపించడానికి రెడీ అయ్యారు హృతిక్. హిందీలో ‘క్వీన్’, ‘షాందార్’ సినిమాలకు దర్శకత్వం వహించిన వికాస్ బాల్ ‘సూపర్ 30’ టైటిల్‌తోనే ఈ సినిమా రూపొందించనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ 23న సినిమాను విడుదల చేయన్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment