
హృతిక్ రోషన్
బాలీవుడ్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్‌ను స్క్రీన్ మీదకు తీసుకురావడంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు దర్శక–నిర్మాతలు. గతంలో ధోనీ బయోపిక్ తీశారు. ప్రస్తుతం 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా ‘83’ తెరకెక్కింది. తాజాగా మాజీ భారత క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. కరణ్ జోహార్ ఈ బయోపిక్ నిర్మించే సన్నాహాలు చేస్తున్నారట. దీని కోసం గంగూలీతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట కరణ్. గంగూలీ పాత్ర కోసం హృతిక్ రోషన్ పేరును పరిశీలిస్తున్నారట. మైదానంలో చూపించిన దూకుడు స్వభావం, కెప్టెన్‌గా సాధించిన విజయాలు వంటి చాలా అంశాలు గంగూలీ కెరీర్‌లో ఉన్నాయి. అందుకే అతని కథ పక్కా కమర్షియల్ సినిమాకు సరిపడేలా ఉంటుందని గంగూలీ ఫ్యాన్స్ హర్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment