హాలీవుడ్‌ పిలుపొచ్చింది! | Hrithik Roshan rejects Hollywood movie | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ పిలుపొచ్చింది!

Published Mon, Feb 19 2018 12:14 AM | Last Updated on Mon, Feb 19 2018 12:14 AM

Hrithik Roshan rejects Hollywood movie  - Sakshi

హృతిక్‌ రోషన్‌

గత పదేళ్లుగా హాలీవుడ్‌కు ఇండియన్‌ మార్కెట్‌లో క్రేజ్‌ బాగా పెరిగింది. మరోపక్క ఇండియన్‌ సినిమా బాక్సాఫీస్‌ స్టామినా కూడా రెట్టింపయింది. ఈ పరిస్థితుల్లో ఇండియన్‌ మార్కెట్‌కు మరింత దగ్గరవ్వాలని హాలీవుడ్‌ పెద్ద స్టూడియోలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడి స్టార్స్‌తో హాలీవుడ్‌ సినిమాలు నిర్మించాలన్న ఆలోచనలు చేస్తున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ఇక్కడ ముందు వరుసలో ఉంటున్నాడు.

హృతిక్‌ ఆరడుగులు ఉంటాడు. సిక్స్‌ప్యాక్‌ బాడీ. చూడ్డానికి హాలీవుడ్‌ హీరోలా ఉంటాడని పేరు. ఆ పేరుకు తగ్గట్టే ఆయన చేసిన ‘క్రిష్‌’ తరహా సూపర్‌ హీరో సినిమాలు కూడా హాలీవుడ్‌ను తలపిస్తాయి. ఇంకేం! హృతిక్‌ హాలీవుడ్‌ హీరో అయిపోవచ్చని చాలామంది బాలీవుడ్‌ నిర్మాతలు అనేసుకున్నారు. హాలీవుడ్‌ నిర్మాతల వరకూ చేరింది ఈ మాట. దీంతో ఇప్పటికి హృతిక్‌కు రెండు, మూడు హాలీవుడ్‌ ఆఫర్లు వచ్చాయి. కాకపోతే అవన్నీ సెకండ్‌ లీడ్‌ అట. హాలీవుడ్‌లో అయితే ఫుల్‌ లెంగ్త్‌ హీరోగానే చేయాలనుకుంటున్న హృతిక్, ఈ ఆఫర్లు ప్రస్తుతానికి రిజెక్ట్‌ చేశాడట. మరి ఆ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ ఎప్పుడొస్తుందో చూడాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement