శ్రీ రాముడిగా? | Hrithik Roshan to play Lord Ram in Allu Aravind Ramayana | Sakshi
Sakshi News home page

శ్రీ రాముడిగా?

Published Tue, Aug 6 2019 2:39 AM | Last Updated on Tue, Aug 6 2019 2:39 AM

Hrithik Roshan to play Lord Ram in Allu Aravind Ramayana - Sakshi

హృతిక్‌ రోషన్‌

‘సూపర్‌ 30’ సక్సెస్‌తో సూపర్‌ ఎనర్జీలో ఉన్నారు హృతిక్‌ రోషన్‌. ఇప్పుడు వరుసగా  సినిమాలను సైన్‌ చేస్తున్నారు. ఫర్హాన్‌ ఖాన్‌తో ‘సత్తే పే సత్తే’, ఆ తర్వాత ‘క్రిష్‌ 4’ ఉంటుందని ప్రకటించారు. లేటెస్ట్‌గా అల్లు అరవింద్, నమిత్‌ మల్హోత్రా నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణ్‌’ సినిమాలో హృతిక్‌ హీరోగా నటించనున్నారని బాలీవుడ్‌ టాక్‌. ఇందులో శ్రీరాముడిగా హృతిక్‌ నటించనున్నారట. లైవ్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాను ‘దంగల్‌’ ఫేమ్‌ నితేష్‌ తివారి, ‘మామ్‌’ దర్శకుడు రవి ఉడయార్‌ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూడు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రం బడ్జెట్‌ సుమారు 1500 కోట్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement