బ్యాంగ్ బ్యాంగ్ డేర్... | Priyanka Chopra Takes Hrithiks Bang Bang Dare | Sakshi
Sakshi News home page

బ్యాంగ్ బ్యాంగ్ డేర్...

Published Thu, Oct 2 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

బ్యాంగ్ బ్యాంగ్ డేర్...

బ్యాంగ్ బ్యాంగ్ డేర్...

హృతిక్ రోషన్ జీనియస్ ఐడియా ‘బ్యాంగ్ బ్యాంగ్ డేర్’ తన సినిమాకు మాంచి పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. బీ-టౌన్ స్టార్ ఫ్రెండ్స్‌ను చిత్రవిచిత్రమైన స్టైల్‌లో ఈ డ్రీమ్ బాయ్ చాలెంజ్ చేస్తున్నాడు. వాళ్లూ అంతే ‘డేర్’గా స్పందిస్తున్నారు. దమ్ముంటే తలకిందులగా నిలుచో అని ప్రియాంకా చోప్రాను సవాల్ చేస్తే... అసలే మేరికోమ్ ట్రైనింగ్‌లో రాటుదేలిందేమో... క్షణం ఆలస్యం లేకుండా చేసి చూపింది. ప్రియాంకతో మొదలైన ఈ చాలెంజ్ షారూఖ్, ఫరాఅక్తర్, నర్గీస్ ఫక్రీ ఇలా సాగుతూనే ఉంది.
 
రణబీర్ కపూర్ డిశ్చార్జ్...
పుట్టిన రోజునాడు హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కోలుకున్నాడు. మైనర్ సర్జరీ అనంతరం ముంబై బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ నుంచి బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యాడు. ‘ఎడినాయిడ్ టాన్సిల్’తో బాధపడుతున్న రణబీర్ గత నెల 28న  ఆసుపత్రిలో చేరాడు. దీంతో కొంత కాలంగా అతను బాధపడుతున్నాడని సమాచారం. అయితే ఇది మైనర్ సర్జరీ మాత్రమేనని, ఇందులో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆసుపత్రి వర్గాల తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement