ప్రేమ పక్షులు.. ఏడడుగులేస్తారా? | Bollywood Lovebirds May Get Marriage | Sakshi
Sakshi News home page

ఏడడుగులేస్తారా?

Published Fri, Feb 14 2020 12:32 AM | Last Updated on Fri, Feb 14 2020 9:41 AM

Bollywood Lovebirds May Get Marriage - Sakshi

ఇవాళ ప్రేమికుల దినోత్సవం. ప్రేమోత్సవం. ప్రేయసిని ఎలా సర్‌ప్రైజ్‌ చేయాలని ఒకరు, ఈరోజు ఎలా అయినా ప్రేమను చెప్పేయాలని ధైర్యం కూడదీసుకుంటూ ఇంకొకరు బిజీగా ఉంటారు. ఇలా ప్రేమలో పడ్డవాళ్లు, పడబోతున్నవాళ్లకు ఇది స్పెషల్‌ డే. ప్రస్తుతం కొందరు హీరోయిన్లు ప్రేమలో ఉన్నారు. ప్రేమ జల్లులో తడుస్తూ ఒక జంట, ప్రేమ వరదలో మునుగుతూ ఓ జంట, ప్రేమగాలిలో తేలుతూ ఒక జంట ఉన్నారు.

విఘ్నేష్, నయనతార

మరి వీళ్లంతా పెళ్లి ఒడ్డుకి చేరుకుంటారా? నేటి ప్రేమికులు రేపటి భార్యాభర్తలవుతారా? కాలమే చెప్పాలి. నయనతార కాదల్‌ (ప్రేమ) లో ఉన్నారు. విఘ్నేష్‌ శివన్‌ రాసే కథల్లో ఉన్నారు. లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ విడదీయలేని ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రేమలో ఉన్నాం అని ప్రకటించకపోయినా వాళ్ల ప్రయాణాలు, సోషల్‌ మీడియా పోస్టులు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. విఘ్నేష్‌ని హబ్బీ అని కూడా అంటారు నయన్‌. మరి పెళ్లి ఎప్పుడు? అంటే ఈ ఏడాదిలో పక్కా అనే వార్త వినిపిస్తోంది. 

ఆలియా భట్‌– రణ్‌బీర్‌ కపూర్‌

దీపికా పదుకోన్‌ – రణ్‌వీర్, ప్రియాంక చోప్రా – నిక్‌ల తర్వాత బాలీవుడ్‌ ప్రేక్షకులంతా ఆసక్తిగా గమనిస్తున్న మరో లవ్‌స్టోరీ ఆలియా భట్‌– రణ్‌బీర్‌ కపూర్‌లది.  ఆలియా, రణ్‌బీర్‌ ప్రస్తుతం లవ్‌లో ఉన్నారు. త్వరలోనే వీళ్ల ఇంట్లో వెడ్డింగ్‌ బెల్స్‌ మోగబోతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో యంగ్‌ బాలీవుడ్‌ కపుల్‌ టైగర్‌ ష్రాఫ్‌ – దిశా పటానీ. టైగర్‌తో లంచ్, డిన్నర్‌లో తరచూ కనిపిస్తుంటారు దిశా. టైగర్‌ ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా మిస్‌ అవ్వకుండా కనిపిస్తారు. మరి పెళ్లి ఎప్పుడంటే నవ్వేస్తారామె.

టైగర్‌ ష్రాఫ్‌ – దిశా పటానీ

తాప్సీకి కొంతకాలంగా బ్యాడ్మింటన్‌ మీద ఆసక్తి పెరిగిందని సరదాగా జోక్‌ చేస్తుంటారు. కారణం బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మథియాస్‌ బోతో ప్రేమలో పడటమే. కానీ ఈ విషయాన్ని బయట ఎక్కువగా ప్రస్తావించరు. ‘ప్రేమకు వయసుతో సంబంధం లేదు’ అంటే అవును.. అవును అంటారు సీనియర్‌ హీరోయిన్లు మలైకా అరోరా, సుస్మితా సేన్‌. కారణం వాళ్ల కంటే వయసులో చిన్నవాళ్లతో ప్రేమలో ఉండటమే. అర్జున్‌ కపూర్‌ (34)– మలైకా అరోరా (46) ప్రేమలో ఉన్నారు. 44 ఏళ్ల సుస్మితా సేన్, 28 ఏళ్ల రోహ్‌మాన్‌ ప్రేమలో ఉన్నారు. వయసుది ఏముంది? ప్రేమ ముఖ్యం అంటారు వీళ్లు. మరి వచ్చే ఏడాది వేలంటైన్స్‌ డే లోపల ఈ జంటలన్నీ ఏడడుగులేస్తాయా? అంతదాకా వెళ్లకుండానే బ్రేకప్‌ అవుతారా? వేచి చూద్దాం.

మథియాస్, తాప్సీ


అర్జున్, మలైకా


రోహ్‌మాన్, సుస్మిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement