శ్వేతాబసుకు ఊహించని ఆఫర్! | Hansal Mehta may offer Shweta Prasad role in his film | Sakshi
Sakshi News home page

శ్వేతాబసుకు ఊహించని ఆఫర్!

Published Fri, Sep 5 2014 6:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

శ్వేతాబసుకు ఊహించని ఆఫర్! - Sakshi

శ్వేతాబసుకు ఊహించని ఆఫర్!

ముంబై: కొత్త బంగారులోకం సినిమా నటి, వ్యభిచారం కేసులో అరెస్టయి కష్టాల్లో ఉన్నశ్వేతాబసు ప్రసాద్కు ఊహించని అవకాశం రానుంది. బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా తన తరువాతి చిత్రంలో శ్వేతాబసుకు ఆఫర్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. హన్సల్ ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు.

'నా తరువాతి చిత్రంలో శ్వేతాబసుకు ఆఫర్ ఇవ్వాలని భావిస్తున్నాను. మక్దీ చిత్రంలో ఆమె బాగా నటించారు' అని మెహతా ట్వీట్ చేశారు. వ్యభిచారం కేసుకు సంబంధించి ఆమెను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని సూచించారు. ఆమె ఫొటోలను ప్రచురించడం ఆపాలని ట్వీట్ చేశారు. సహచర నటులు అదితి రావు, ఉపేన్ పటేల్ శ్వేతాబసుకు మద్దతుగా ట్వీట్లు చేశారు. హైదరాబాద్లోని ఓ లాడ్జిలో శ్వేతాబసు వ్యభిచారం కేసులో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం హైదరాబాద్లోని రెస్య్కూ హోంలో ఉంటోంది. తనకు సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, మరో మార్గం లేక డబ్బుల కోసం వ్యభిచార వృత్తిలోకి దిగానని శ్వేతాబసు పోలీసులకు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement