సిమ్రన్గా కంగనా | Kangana Ranaut owns the deglam look as an NRI nurse for simran | Sakshi
Sakshi News home page

సిమ్రన్గా కంగనా

Published Thu, Jul 7 2016 8:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:20 AM

సిమ్రన్గా కంగనా

సిమ్రన్గా కంగనా

బాలీవుడ్ తెర మీద నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆధరణ లభిస్తోంది. దీంతో ఎంతో మంది దర్శకనిర్మాతలు ఈ తరహా సినిమాలను తెరకెక్కించడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. జాతీయ ఉత్తమ నటిగా మూడు సార్లు అవార్డు అందుకున్న బాలీవుడ్ బ్యూటి కంగనా రనౌత్, ఈ తరహా సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తోంది. సిమ్రన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా, ఓ గుజరాతి ఎన్నారై నర్సు పాత్రలో కనిపిస్తోంది.

గ్లామర్ షోకు ఏ మాత్రం వెనకాడని ఈ బ్యూటి.., సిమ్రన్ సినిమాలో ఎలాంటి మేకప్ లేకుండా డీగ్లామర్స్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాకు సంబందించిన కంగనా ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆధర్శ్ తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశారు. జాతీయ అవార్డ్ దర్శకుడు హన్సల్ మెహతా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా, భూషణ్ కుమార్ శైలేష్ సింగ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement