నిర్మాతగా మారిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ | Kareena Kapoor Turns As Producer For Hansal Mehta-Ekta Kapoor Project | Sakshi
Sakshi News home page

Kareena Kapoor : హీరోయిన్‌గా నటిస్తూనే, నిర్మాణ రంగంలోకి..

Published Thu, Aug 12 2021 6:57 PM | Last Updated on Thu, Aug 12 2021 7:28 PM

Kareena Kapoor Turns As Producer For Hansal Mehta-Ekta Kapoor Project - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు 'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌తో పాపులర్‌ అయిన హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కరీనా..'హన్సల్‌ మెహతా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు. ఏక్తా కపూర్‌ సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. యూకేలో షూటింగ్‌ జరగనున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం కరీనా అమిర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement