ఆస్కార్‌లో నిరాశ.. లాపతా లేడీస్‌ను సెలక్ట్‌ చేయడమే తప్పంటున్న డైరెక్టర్‌ | Hansal Mehta Slams Film Federation's 'Wrong Selection' After Laapataa Ladies Misses Oscar | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌లో భారతీయ సినిమాకు నిరాశ..'లాపతా లేడీస్‌ను సెలక్ట్‌ చేయడమే తప్పు'

Published Wed, Dec 18 2024 11:44 AM | Last Updated on Wed, Dec 18 2024 11:55 AM

Hansal Mehta Slams Film Federation's 'Wrong Selection' After Laapataa Ladies Misses Oscar

లాపతా లేడీస్‌.. బాక్సాఫీస్‌ దగ్గర మిక్స్‌డ్‌ టాక్‌ అందుకున్న ఈ సినిమాకు ఓటీటీ ప్రియులు బ్రహ్మరథం పట్టారు. కాన్సెప్ట్‌ కొత్తగా ఉందని ఎగబడి చూశారు. అంతేనా? ఏకంగా ఆస్కార్‌ కోసం మన దేశం నుంచి లాపతా లేడీస్‌ చిత్రాన్ని పంపించారు. కానీ ఆదిలోనే భంగపాటు ఎదురైంది. ఈ సినిమా షార్ట్‌ లిస్ట్‌ కాకపోవడంతో అకాడమీ అవార్డుల రేసులో నుంచి తప్పుకుంది. అయితే ఆస్కార్‌కు ఈ సినిమాను ఎంపిక చేయడమే పెద్ద తప్పంటున్నాడు దర్శకనిర్మాత హన్సల్‌ మెహతా.

మరో ఫెయిల్యూర్‌
ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి తన వైఫల్యాన్ని చాటిచెప్పింది. ఏయేటికాయేడు సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేస్తూ పూర్తిగా వెనకబడుతోంది అని ట్వీట్‌ చేశాడు. దీనికి పలువురు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. కేన్స్‌, స్పిరిట్‌, గోల్డెన్‌ గోబ్స్‌ వంటి అంతర్జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ సినిమాను పంపించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఆస్కార్‌ బరిలో ఇండియన్‌ సినిమాలు అడ్రస్‌ లేకుండా పోతున్నాయని కామెంట్లు చేస్తున్నారు.

లాపతా లేడీస్‌
లాపతా లేడీస్‌ విషయానికి వస్తే.. మహిళా డైరెక్టర్‌ కిరణ్‌ రావు తీసిన ఈ మూవీ మార్చిలో విడుదలైంది. ప్రతిభ రంత, నితాన్షి గోయల్‌, స్పర్ష్‌ శ్రీవాత్సవ, రవి కిషన్‌, ఛాయా కదమ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నాలుగైదు కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. 

 

చదవండి: రూ.10 టికెట్‌లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement