బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ సెట్స్‌లో చిత్రవిచిత్రంగా ప్రవర్తించేవాడంటున్నాడు ప్రముఖ డైరెక్టర్ హన్సల్ మెహతా. 'దిల్ పే మత్ లె యార్' సినిమా సెట్స్‌లో మనోజ్‌ను చూసి ఇతరులు భయపడేవారని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ.. 'దిల్ పే మత్ లె యార్ సినిమా 2000వ సంవత్సరంలో రిలీజైంది. ఆ సినిమా షూటింగ్‌లో మనోజ్ చాలా వింతగా ప్రవర్తించేవాడు. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. తనకు చాలా మూడ్ స్వింగ్స్ ఉండేవి. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలిసేది కాదు. చెప్పాలంటే ఆ సమయంలో అతడు మాకు తలనొప్పిలా మారాడు.
అలా అని చెడ్డవాడు కాదు!
అలా అని అతడు చెడ్డవాడు కూడా కాదు. మంచివాడు. కానీ ఊరికే చికాకు తెప్పించేవాడు. ఒకసారి నాకు కోపమొచ్చి ఎందుకిలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నావని అడిగేశా. అప్పుడు అతడు ఏం సమాధానమివ్వకుండా తన పాత్ర డైలాగ్స్‌కు సంబంధించి పేపర్ తీసుకుని ప్రిపేర్ అయ్యాడు. అతడు చేయాల్సిన రోల్ ఇలా ఇరిటేటింగ్‌గా ఉండాలని ఎవరు చెప్పకపోయినా అలాగే ప్రవర్తించేవాడు. అందరి మీదా అరిచేవాడు. చాలామంది అతడికి దూరంగా పారిపోయేవాళ్లు.
కిల్లర్ సూప్‌లో మనోజ్
సౌరభ్ శుక్లా అయితే.. నేను తనతో మాట్లాడటానికి ప్రయత్నించా.. నిజంగా పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు.. అసలేం జరుగుతోంది అని జుట్టు పీక్కునేవాడు. అలా మనోజ్ సెట్స్‌లో అందరినీ ఆగం చేశాడు' అని చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్, సౌరభ్ శుక్ల 'సత్య' సినిమాలో కలిసి పని చేశారు. అలాగే డైరెక్టర్ హన్సల్‌తో కలిసి అలీఘర్ సినిమాకు పని చేశాడు. ఇకపోతే మనోజ్ ప్రస్తుతం కిల్లర్ సూప్ అనే కామెడీ సిరీస్‌లో నటించాడు. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 11న రిలీజ్ కానుంది. అలాగే హన్సల్ మెహతా తెరకెక్కించిన ద బకింగ్‌హామ్ మర్డర్స్ విడుదలకు రెడీ అవుతోంది.
చదవండి: అమ్మ జీవితంలో చాలా మిస్సయింది.. రెండో పెళ్లి.. మేము ఏమంటామోనని..
Comments
Please login to add a commentAdd a comment