ఎవరెస్టు అధిరోహించనున్న విశాఖ బాలిక | Andhra teen youngest girl to climb Mount Everest | Sakshi
Sakshi News home page

ఎవరెస్టు అధిరోహించనున్న విశాఖ బాలిక

Published Tue, Jul 15 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

ఎవరెస్టు అధిరోహించనున్న విశాఖ బాలిక

ఎవరెస్టు అధిరోహించనున్న విశాఖ బాలిక

విశాఖపట్నం: పిన్న వయసులోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేయటానికి సంకల్పించింది విశాఖపట్నానికి చెందిన 12 ఏళ్ల జాహ్నవి. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని (8,848 మీటర్లు) అధిరోహించడంతో పాటు మిగతా ఆరు శిఖరాలనూ ఎక్కేందుకు సాధన చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 2న హిమాచల్‌ప్రదేశ్ లడఖ్ ప్రాంతంలోని లే మౌంటైన్ (20,080 అడుగులు) ఎక్కడంతో పాటు ప్రపంచంలో ఏడు శిఖరాలపైనా పాదం మోపేందుకు అక్కడ 15 రోజులు శిక్షణ పొందనుంది. అనంతరం ప్రపంచంలో ఎత్తయిన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారో (5,895 మీటర్లు) సెప్టెంబర్‌లో తొలిసారిగా అధిరోహించనుంది. తరువాత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించనుంది. ఈ వివరాలను ఆమె తండ్రి డాక్టర్ కృష్ణారావు సోమవారం విశాఖపట్నంలో విలేకరులకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement