
రెండురోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగావేలం విజయవంతమైంది. కొందరు ఆటగాళ్లు జాక్‌పాట్ దక్కించుకుంటే.. మరికొందరికి నిరాశే మిగిలింది. ఎక్కువ మొత్తం దక్కించుకుంటారనుకున్న ప్లేయర్లకు భంగపాటు ఎదురైంది. అయితే ఈసారి వేలంలో ఆటగాళ్లతో పాటు ఒక 19 ఏళ్ల అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన చురుకుదనంతో చూపు తిప్పుకోకుండా చేసింది. తన చార్మింగ్ లుక్‌తో వేలంలో అందరి దృష్టి తనవైపు ఉండేలా చేసుకుంది. ఎవరా బ్యూటీ గర్ల్ అంటూ టీవీల్లో ఆమెను చూసిన వారంతా ముచ్చటపడ్డారు. కొందరు గుర్తుపట్టారు కూడా. ఆమే.. జాహ్నవి మెహతా. కోల్‌కతా టీం సహా యజమాని, బాలీవుడ్ నటి జూహీ చావ్లా కూతురు.
కోల్‌కతా తరఫున షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్, కుమార్తె సుహానాలతో కలిసి వేలంలో పాల్గొన్నారు జూహీ చావ్లా తనయురాలు జాహ్నవి మెహతా. ఆమె ఆకర్షణీయ రూపం... ఆ కళ్లలో మేజిక్ అందరినీ ఆకర్షించింది.
రెండేళ్ల క్రితం జరిగిన ఐపీఎల్ వేలంలోనూ ఆమె పార్టిసిపేట్ చేసింది. ఇది సెంకడ్ టైమ్. తల్లి జూహ్లీ చావ్లా తోడు లేకుండానే.. కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో యాక్టివ్‌గా వ్యవహరించడం విశేషం. ఆమె ఛార్మింగ్‌తో కెమెరాలన్నీ అటువైపే ఫోకస్ చేశాయి. జాహ్నవి విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసివచ్చి.. ప్రస్తుతం కేకేఆర్ వ్యవహారాలు చూస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment