ఓకే కణ్మణి కాదా? | Mani Ratnam's film undergoes a title change | Sakshi
Sakshi News home page

ఓకే కణ్మణి కాదా?

Published Wed, Feb 11 2015 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

ఓకే కణ్మణి కాదా?

ఓకే కణ్మణి కాదా?

మణిరత్నం ఓకే కణ్మణి చిత్ర టైటిల్ ఓకే కాదా? కాదనే అంటున్నారు చిత్ర వర్గాలు. కడల్ చిత్రం తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రానికి ఓకే కణ్మణి అనే టైటిల్ ప్రచారంలో నానుతోంది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు వాయై మూడి పేసవుం, చిత్ర కథానాయకుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనతో నిత్యామీనన్ జోడీ కడుతున్నారు. ఎ ఆర్‌రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం అలప్పాయుదే (తెలుగులో సఖి) చిత్రం తరహాలో రొమాంటిక్ లవ్‌స్టోరీతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. చిత్ర షూటింగ్‌ను మణిరత్నం చాలా ప్రొఫైల్‌లో వేగంగా పూర్తి చేశారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్ర టైటిల్‌గాని చిత్ర వివరాలను గానిచిత్ర యూనిట్ అధికార పూర్వకంగా వెల్లడించలేదన్నది నిజం. అయితే చిత్ర టైటిల్ ఓకే కణ్మణి గా ప్రచారంలో ఉంది. తాజాగా ఆ టైటిల్ మారనుందని ఓ కాదల్ కణ్మణి పేరును నిర్ణయంచినట్లు సమాచారం. ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోను ఏకకాలంలో అంటే ఏప్రిల్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీనికి తెలుగులో ఓకే బంగారం అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement