అయ్యో అలా ఎప్పుడు చెప్పాను? | nitya menon condemns rumors of her direction | Sakshi
Sakshi News home page

అయ్యో అలా ఎప్పుడు చెప్పాను?: నటి

May 29 2017 8:29 PM | Updated on Sep 5 2017 12:17 PM

అయ్యో అలా ఎప్పుడు చెప్పాను?

అయ్యో అలా ఎప్పుడు చెప్పాను?

నటీమణుల్లో నిత్యామీనన్‌ది సపరేట్‌ బాణీ అనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతుంది.

నటీమణుల్లో నిత్యామీనన్‌ది సపరేట్‌ బాణీ అనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోతుంది. ఆ పాత్ర తనక నచ్చితేనే ఒప్పుకుంటానని నిర్మొహమాటంగా చెప్పే నిత్య ఆ మధ్య మణిరత్నం అవకాశాన్ని కూడా నిరాకరించిందనే ప్రచారం జరిగింది. అయితే అమ్మడికి  ఇటీవల అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అందుకు కారణం కూడా తనేననే ప్రచారం చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. నిత్యామీనన్‌కు దర్శకత్వంపై మోజు పుట్టిందనీ,అందుకే నటిగా అవకాశాలను తిరస్కరిస్తోందన్న ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది.

ఇది ఆ నోటా ఈ నోటా నిత్యామీనన్‌ చెవిన పడింది. అంతే అయ్యో దర్శకత్వం చేస్తానని నేనెప్పుడు ఎవరితో చెప్పాను?. ఇలా కూడా వదంతులు పుట్టిస్తున్నారా? అంటూ రియాక్ట్‌ అయ్యింది. దీని గురించి నిత్యామీనన్‌ మాట్లాడుతూ నిజం చెప్పాలంటే నటిగానే తనకింకా సంతృప్తి కలగలేదని, ఛాలెంజింగ్‌ పాత్రలు చాలా చేయాలని ఆశ పడుతున్నట్లు తెలిపింది.  తనను దర్శకురాలిగా చూడటానికి చాలా మంది ఎదురు చూస్తున్నారన్నది ఆనందాన్ని కలిగిస్తోందని పేర్కొంది.

అయితే ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, భవిష్యత్‌లో దర్శకత్వం గురించి ఆలోచిస్తానని తెలిపింది. ప్రస్తుతం విజయ్‌ 61వ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటిస్తున్నాననీ నిత్యా చెప్పింది. కాగా విజయ్‌ చాలా శాంత స్వభావి అనీ, ఆయనతో తొలి సారిగా నటిస్తున్నాననీ చెప్పింది. అదే విధంగా అట్లీ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని నిత్యామీనన్‌ పేర్కొంది. ఇందులో తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్‌కు జోడిగా నిత్యామీనన్‌ నటిస్తుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement