కండిషన్స్ అప్లై అంటున్న మడోనా | not acting in Glamour role says madonna sebastian | Sakshi
Sakshi News home page

కండిషన్స్ అప్లై అంటున్న మడోనా

Published Tue, Jun 21 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

కండిషన్స్ అప్లై అంటున్న మడోనా

కండిషన్స్ అప్లై అంటున్న మడోనా

ఆదిలో నటి రేవతిలా కుటుంబ కథా చిత్రాల్లోనే నటిస్తాననీ స్టేట్‌మెంట్స్ ఇచ్చిన చాలా మంది నటీమణులు ఆ తరువాత సిల్క్‌స్మిత రేంజ్‌లో అందాలారబోతకు తయారయ్యారు. కాగా ఈ తరం నాయికలు లక్ష్మీమీనన్, నిత్యామీనన్, కీర్తీసురేశ్, మడోనా సెబాస్టియన్ లాంటి వారు తమకంటూ కొన్ని హద్దులను విధించుకుని నటిస్తున్నారు. అయితే వారిలో నటి లక్ష్మీమీనన్ ఇప్పటికే నాన్‌శివప్పుమనిదన్ చిత్రంలో విశాల్‌తో డెరైక్ట్‌గా లిప్ లాక్ సన్నివేశంలో నటించి నిబంధనలను సడలించుకున్నారు. ఇటీవల గ్లామర్‌కు తానూ సై అని గేటులెత్తేశారు.
 
  ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా నటిస్తున్న రెక్క చిత్రంలో అమ్మడి అందాలారబోతను చూడొచ్చంటున్నారు. అలాంటిది అదే విజయ్‌సేతుపతికి జంటగా కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ కుట్టి మడోనా సెబాస్టియన్ ఆరంభ దశలోనే షరతులు విధిస్తున్నార ట. అవి మరీ విడ్డూరంగా ఉన్నాయి. అవేమిటంటే... శారీరక గ్లామర్‌ను ప్రదర్శించే దుస్తులు ధరించను. హీరోలను కౌగిలించుకునే సన్నివేశాలలో నటించను. వారితో సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో నటించను.
 
 ఒకవేళ ఆ హీరో నాకు స్నేహితుడైతే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి అంగీకరిస్తానేమో అంటున్న మడోనా సెబాస్టియన్ కోలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మడోనా సెబాస్టియన్ రెండోసారి విజయ్‌సేతుపతికి జంటగా కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement