అందాలారబోతకు సై | i am ready to glamour role says Tejashree | Sakshi
Sakshi News home page

అందాలారబోతకు సై

Published Sat, Mar 26 2016 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

అందాలారబోతకు సై

అందాలారబోతకు సై

  ప్రాముఖ్యత ఉంటే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ. ప్రాధాన్యం అంటే అందాలారబోతలో రెచ్చిపోతా నంటోంది ముంబై బ్యూటీ తేజశ్రీ. ఉత్తరాది భామలు దక్షిణాదిలో దుమ్మురేపడం కొత్తేమీకాదు. కొందరు హీరోయిన్లగా వెలిగిపోతుంటే, మరి కొందరు ఐటమ్ సాంగ్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏమైనా ఉత్తరాది ముద్దుగుమ్మలకు దక్షిణాదిలో క్రేజే వేరు. అలాంటి వారి పట్టికలో నేనూ చేరాలని ఉర్రూతలూగుతోంది నటి తేజశ్రీ. ముంబైయికి చెందిన ఈ అమ్మడు ఇప్పడికే అట్టీ చిత్రంతో కోలీవుడ్‌లో కర్చీఫ్ వేయబోతోంది.
 
 ఆ చిత్రంలో మంకేపీ.ఆనంద్‌తో ఐటమ్ సాంగ్ ఆడేసింది. అందులోని గిల్లీ బంబరం సోల్రా మచ్చా అనే పాటలో తేజశ్రీ తనదైన అందాలతో చెడుగుడు ఆడేసిందట. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం నటుడు భరత్‌తో కలసి ఒక చిత్రం చేస్తోంది. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాలన్న కోటి ఆశలతో ముంబై ఎక్స్‌ప్రెస్ ఎక్కి చెన్నైకి వచ్చిన ఈ జాణ కోరికలు, భావాలు ఏమిటో చూద్దాం. హిందీ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న నాకు తమిళంలో నయనతారలా మంచి కథా పాత్రలో నటించాలని ఆశ.
 
 ఇక శంకర్, గౌతమ్‌మీనన్, ఏఆర్.మురుగదాస్, సుశీంద్రన్, వెట్రిమారన్ వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా విశాల్, ఆర్య, కార్తీ, ధనుష్, జయంరవిలతో రొమాన్స్ చేయాలని కలల కంటున్నాను. మంచి పాత్రలు అమరితే, వాటికి గ్లామర్ అవసరం అయితే అందుకు తగ్గట్టుగా రెచ్చిపోయి నటిస్తా. ఈ విషయంలో పెద్ద చిత్రాలు, చిన్న చిత్రాలు అన్న తారతమ్మం చూపను.అంటున్న నటి తేజశ్రీ తమిళ సినిమా ముందు ముందు ఏ స్థాయిలో కూర్చోబెడుతుందో వేచి చూడాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement