ఆ ఇమేజ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నా: రష్మీ | Rashmi Gautam Comments On Glamour Image | Sakshi
Sakshi News home page

ఆ ఇమేజ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నా: రష్మీ

Published Sat, Aug 25 2018 9:05 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

Rashmi Gautam Comments On Glamour Image - Sakshi

రష్మీ గౌతమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘నా మీద వేసిన గ్లామర్‌ డాల్‌ ముద్రను నేను కోరుకున్నా.. లేకున్నా, ఆ ఇమేజ్‌ను మాత్రం ఎంజాయ్‌ చేస్తున్నాను’ అని చెప్పింది బుల్లితెర, వెండి తెర నటి రష్మీ గౌతమ్‌. పంజగుట్టలోని టీబీజెడ్‌ ది ఒరిజినల్‌ షోరూమ్‌లో శుక్రవారం ఆమె టెంపుల్‌ కలెక్షన్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ... ‘భారతీయతను ప్రతిబింబించే ఆభరణాలు నాకిష్టం. ఆభరణాలు ధరిస్తే అందం, ఆనందం మాత్రమే కాదు.. అవి రేపటి ఆదాయానికి పెట్టుబడి కూడా’ అని పేర్కొంది. షోరూమ్‌ నిర్వాహకులు మాట్లాడుతూ... దేశంలోని సంస్కృతి సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలను పరిగణలోకి తీసుకొని టెంపుల్‌ జ్యువెలరీని రూపొందించామని చెప్పారు.

కాగా, రష్మీ గౌతమ్ తాజా సినిమా ‘అంతకు మించి’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మరుసటి రోజే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. అంతకుమించి సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆ సినిమా నిర్మాత గౌరీకృష్ణప్రసాద్‌ శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement