సీనియర్‌తో జోడీకి రెడీ | Heroine Regina Reday for Glamour role | Sakshi
Sakshi News home page

సీనియర్‌తో జోడీకి రెడీ

Published Wed, Feb 4 2015 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

సీనియర్‌తో జోడీకి రెడీ

సీనియర్‌తో జోడీకి రెడీ

సీనియర్ హీరోతో నటించేందుకు రెడీ అని నటి రెజీనా గేట్లు తెరిచేసింది. యువ హీరోయిన్ స్వాతి, బిందు మాధవి, నందిత వంటి వారు సీనియర్ హీరోల పక్కన నటించేంది లేదంటూ, అవకాశాలు దూరం చేసుకుంటున్నారు. అలాంటిది తమిళంలో అలగియ అసుర, నిర్ణయం, కేడి బిల్లా, కిలాడి రంగ చిత్రాల్లో నటించిన రెజీనా ఆ తర్వాత తమిళంలో అవకాశాలు లేక పోవడంతో ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించారు.   తెలుగులో ఆమెకు అదృష్టం కలసి వచ్చింది. అక్కడ పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో, అక్కడే స్థిరంగా పాగా వేయాలని కోరుకుంటున్నది. అందులో భాగంగా, ప్రస్తుతం యువ హీరోల సరసన నటిస్తున్న ఈ బ్యూటీ , ఇకపై బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించడానికి రెడీ అంటూ ప్రకటించింది. అదే విధంగా మరో ఐదేళ్ల వరకు పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇక విషయం ఏమిటంటే, ఇంతకు ముందు గ్లామర్‌గా నటించడానికి నిరాకరించిన రెజీనా, ఇక అందాల అరబోతకు రెడీ అంటోంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement