heroine Regina
-
ప్రముఖ హీరోయిన్గా రాణించాలన్నదే ఆశ
తాను అలాంటి పాత్రలు చేయను అంటోంది నటి రెజీనా. చాలా కాలం తరువాత ఈ అమ్మడికి కోలీవుడ్‌లో టైమ్ వచ్చినట్లుంది. ఎప్పుడో శివకార్తికేయన్‌తో కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రంలో జత కట్టిన రెజీనాకు ఆ చిత్రం విజయం సాధించినా అవకాశాలు రాలేదు. మధ్యలో రాజతందిరం వంటి ఒకటి అరా చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినా కోలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం చేతిలో మూడు తమిళ చిత్రాలు ఉన్నాయి. రెజీనా నటించిన మానగరం చిత్రం మంచి విజయాన్ని ఇచ్చింది. తాజాగా ఉదయనిధి స్టాలిన్‌తో జత కట్టిన సరవణన్ ఇరుక్కభయమేన్ చిత్రం మంచి ఆదరణను పొందుతోంది. అయితే ఈ చిత్రంతోనే అమ్మడు బాగా వార్తల్లో నానుతోంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్‌తో డ్యూయెట్స్‌లో గ్లామర్ విషయంలో కాస్త శ్రుతిమించి నటించింది. దీంతో అవకాశాలు బాగానే తలుపు తడుతున్నాయట. అయితే దర్శకులు కమర్షియల్ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తనకు కధలను వినిపిస్తున్నారంటూ వాపోతోంది. తాను అలాంటి పాత్రల్లో నటిస్తే తనకు గ్లామరస్ నాయకిగా ముద్ర పడిపోతుందని భావించి ఆ అవకాశాలను తిరస్కరించానని చెప్పుకొచ్చింది. గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలన్నది తన లక్ష్యం కాదని, కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా రాణించాలన్నదే తన ఆశ అని చెప్పింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎస్జే.సూర్యకు జంటగా నటిస్తున్న నెంజం మరప్పదిల్లై, అధర్వతో నటిస్తున్న జెమినీగణేశనుం సురుళీరాజవుం, రాజతందిరం-2 చిత్రాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తున్నానని, ఈ చిత్రాలు తనకు మంచి పేరు తెచ్చిపెడతాయనే నమ్మకం ఉందని రెజీనా చెప్పుకొచ్చింది. -
రెజీనా కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందా?
-
సీనియర్‌తో జోడీకి రెడీ
సీనియర్ హీరోతో నటించేందుకు రెడీ అని నటి రెజీనా గేట్లు తెరిచేసింది. యువ హీరోయిన్ స్వాతి, బిందు మాధవి, నందిత వంటి వారు సీనియర్ హీరోల పక్కన నటించేంది లేదంటూ, అవకాశాలు దూరం చేసుకుంటున్నారు. అలాంటిది తమిళంలో అలగియ అసుర, నిర్ణయం, కేడి బిల్లా, కిలాడి రంగ చిత్రాల్లో నటించిన రెజీనా ఆ తర్వాత తమిళంలో అవకాశాలు లేక పోవడంతో ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించారు. తెలుగులో ఆమెకు అదృష్టం కలసి వచ్చింది. అక్కడ పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో, అక్కడే స్థిరంగా పాగా వేయాలని కోరుకుంటున్నది. అందులో భాగంగా, ప్రస్తుతం యువ హీరోల సరసన నటిస్తున్న ఈ బ్యూటీ , ఇకపై బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో నటించడానికి రెడీ అంటూ ప్రకటించింది. అదే విధంగా మరో ఐదేళ్ల వరకు పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇక విషయం ఏమిటంటే, ఇంతకు ముందు గ్లామర్‌గా నటించడానికి నిరాకరించిన రెజీనా, ఇక అందాల అరబోతకు రెడీ అంటోంది. -
‘పిల్లా నువ్వులేని జీవితం’ నచ్చిందా..!
* అభిమానులను పలుకరించిన హీరోహీరోయిన్లు * సినిమాను థియేటర్లో చూడండి.. కరీంనగర్‌కల్చరల్ : పిల్లా నువ్వులేని జీవితం సినిమాను పైరసీ సీడీల్లో కాకుండా థియేటర్లోనే చూసి ఆశీర్వదించాలని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అధినేత, నిర్మాత దిల్ రాజు అన్నారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా గురువారం ఆ చిత్రం ప్రదర్శిస్తున్న నగరంలోని వేంకటేశ్వర థియేటర్, ప్రతిమా మల్టీప్లెక్స్‌లో హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రెజీనా, దర్శకుడు ఏఎస్.రవికుమార్చౌదరితో కలిసి ప్రేక్షకులను కలుసుకున్నారు. వారికి అభిమానులు డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రతిమా మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ సీడీలు బయటకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతకు పెట్టిన డబ్బు రాక, మళ్లీ సినిమా తీసే ఆలోచన మానుకుంటున్నారన్నారు. సినిమాను థియేటర్లలో చూడడంతోనే ఆనందం ఉంటుందన్నారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రెజినా మాట్లాడుతూ చిత్ర విజయానికి కారణమైనవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నిర్మాతలు బన్నివాసు, శ్రీహర్షిత్, నటుడు ప్రభాస్‌శ్రీను, మల్టీప్లెక్స్ జనరల్ మేనేజర్ రఘువేంద్రబాబు, ఎజీఏం వేణు, మేనేజర్ జగదీశ్వర్, శ్రీకాంత్, మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు.