హీరో భార్యకు విడాకులు ఇమ్మన్న హీరోయిన్! | Is Yami Gautam urging Pulkit Samrat to divorce his wife? | Sakshi
Sakshi News home page

హీరో భార్యకు విడాకులు ఇమ్మన్న హీరోయిన్!

Published Sun, Jul 3 2016 5:50 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

హీరో భార్యకు విడాకులు ఇమ్మన్న హీరోయిన్!

హీరో భార్యకు విడాకులు ఇమ్మన్న హీరోయిన్!

ముంబై: బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్, తన భార్య శ్వేత రొహిర మధ్య విభేదాలకు హీరోయిన్ యామి గౌతమ్ కారణమన్న ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. యామి ప్రేమలో పడే భార్యకు అతడు దూరమయ్యాడని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. విడాకులు తీసుకోమని పులకిత్ కు సలహా యిచ్చింది కూడా ఆమేనని అంటున్నారు. మన బంధం ముందుకు సాగాలంటే విడాకులు తీసుకోవాల్సిందేనని అతడికి యామి గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది.

దీని గురించి పులకిత్ నోరు విప్పడం లేదు. తన సినిమా విడుదల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని, న్యాయ వ్యవహారాలు చూసుకునేందుకు తనకిప్పుడు సమయం లేదని పేర్కొన్నాడు. తనకు, శ్వేతకు మధ్య విభేదాలు తలెత్తడం దురదృష్టమన్నాడు. గతేడాది అక్టోబర్ నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. కాగా,  పులకిత్, యామి గౌతమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా 'జునూనియత్' సినిమా ఇటీవల విడుదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement