![Bollywood actor Yami Gautam adds BMW X7 luxury SUV to her garage - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/26/yami.jpg.webp?itok=bdQklZYe)
విక్కీ డోనర్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ లాంటి చిత్రాల్లో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి యామీ గౌతమ్. తాజాగా బీఎండబ్ల్యూ ఎక్స్7 లగ్జరీ కారును కొనుగోలు చేసింది భామ. ఈ విషయాన్ని కార్లను విక్రయించే డీలర్‌షిప్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. యామీ గౌతమ్ కొనుగోలు చేసిన వాటిలో ఖరీదైన లగ్జరీ కారుగా నిలవనుంది.
(ఇది చదవండి: దళపతి విజయ్‌పై పోలీస్ కేసు.. అలా చేసినందుకు!)
యామీ గౌతమ్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారు విలువ దాదాపు 1.24 కోట్లుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. యామీ గౌతమ్ గ్యారేజీలో ఇది మూడో లగ్జరీ కారుగా నిలవనుంది. ఆమెకు ఇప్పటికే ఆడి ఏ4, ఆడి క్యూ7 మోడల్ కార్లు ఉన్నాయి. అయితే మూడింటిలో తాజాగా కొన్న కారు అత్యంత ఖరీదైనదిగా సమాచారం.
(ఇది చదవండి: 'ద కేరళ స్టోరీ' సినిమాకు ఓటీటీ కష్టాలు.. కారణం అదేనా?)
Comments
Please login to add a commentAdd a comment