బాలీవుడ్‌లో ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ-2 సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షోకు హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ- 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న జియా శంకర్ ఇటీవలే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే రియాలిటీ షో నుంచి బయటకొచ్చేసిన జియాశంకర్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కారు ముందు జియాశంకర్ కొబ్బరికాయ కొడుతూ కనిపించింది.
(ఇది చదవండి: చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్ హిట్ డైరెక్టర్‌కు ఛాన్స్)
అంతే కాకుండా జియా తన కొత్త కారు ముందు పోజులిస్తూ ఉత్సాహంగా కనిపించింది. ఆ తర్వాత అక్కడున్న వారందరికీ స్వీట్లు కూడా పంచింది. జియా కొనుగోలు చేసిన కారు యస్‌యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్5 మోడల్ కాగా.. ముంబయిలో ఈ మోడల్ కారు ధర దాదాపు రూ. 1.3 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జియా బిగ్ బాస్ ఓటీటీ- 2లో పాల్గొనడంతో ప్రేక్షకుల్లో మరింత ఆదరణ తెచ్చుకుంది. ఆమె ఈ రియాలిటీ షోలో టాప్-6 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. ఆమె 2013లో తెలుగు చిత్రం ఎంత అందంగా ఉన్నావే చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించింది. రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్‌లతో కలిసి మరాఠీ చిత్రం వేద్‌లో చివరిసారిగా జియా కనిపించింది. అంతే కాకుండా జియా లవ్ బై ఛాన్స్, ప్యార్ తునే క్యా కియా, మేరీ హనికరక్ బీవీ, కాటేలాల్ అండ్ సన్స్, లాల్ ఇష్క్, పిశాచిని, గుడ్‌నైట్ ఇండియా వంటి అనేక ప్రముఖ టీవీ షోలలో కనిపించింది.
(ఇది చదవండి: జైలర్ నటుడితో జత కట్టనున్న ఇద్దరు హీరోయిన్స్!)
Comments
Please login to add a commentAdd a comment