ఆ హీరోయిన్ వల్లే నా కొంప మునిగింది | Shweta Rohira opens up about divorce with Pulkit Samrat, blames Yami Gautam for the split! | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ వల్లే నా కొంప మునిగింది

Published Wed, Jul 13 2016 7:31 PM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

Shweta Rohira opens up about divorce with Pulkit Samrat, blames Yami Gautam for the split!

న్యూఢిల్లీ: బాలీవుడు నటుడు పులకిత్ సామ్రాట్ భార్య శ్వేత రోహిర తన భర్తతో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. హీరోయిన్ యామీ గౌతమ్ వల్లే తమ బంధం చెడిందని ఆరోపించింది.

పులకిత్, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, మొదట్లో తమ కాపురం సవ్యంగా సాగిందని, యామీ గౌతమ్తో తన భర్తకు అనుబంధం ఏర్పడ్డాక తమ ఇద్దరి మధ్య కలతలు వచ్చాయని రోహిర ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. పులకిత్తో తాను విడిపోవడానికి యామీ గౌతమ్ కారణమని ఆరోపించింది.

కాగా తన భార్య శ్వేత రొహిరతో కలిసుండలేనని పులకిత్ కూడా ఇటీవల చెప్పాడు. తమ వివాహ బంధం తెగిపోయిందని ప్రకటించాడు.  సానుభూతి పొందేందుకు తన ఇమేజ్ ను శ్వేత దెబ్బతీస్తొందని, వ్యక్తిగత విషయాలను బహిరంగపరచి రచ్చ చేస్తోందని విమర్శించాడు. ఇక ఆమెతో ఎటువంటి సంప్రదింపులు సాగించనని, తన వివాహ బంధం ముగిసినట్టేనని పులకిత్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement