
సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న హారర్ కామెడీ చిత్రం ‘భూత్ పోలీస్’. పవన్ క్రిపలానీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సైఫ్, అర్జున్‌లకు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండజ్, యామీ గౌతమ్ నటించనున్నారు. ఫాతిమా సనా షేక్ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ‘‘ఇదో వినోదాత్మక చిత్రం. దీనికి మరింత సరదాను ఈ ఇద్దరు హీరోయిన్లు తీసుకువస్తారని అనుకుంటున్నాం. సైఫ్–జాక్వెలిన్, అర్జున్–యామీ జంటలు అందించే వినోదం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనుకుంటున్నాం’’ అన్నారు దర్శకుడు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.