
ఆదిపురుష్, దేవర సినిమాల్లో విలన్ పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకు కాస్త దగ్గరైన నటుడు నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). ఇకపోతే మూడు నెలల క్రితం ఇతడు తన ఇంట్లో ఉన్నప్పుడు ఓ దుండగుడు ఇతడిపై దాడి చేశాడు. తక్షణమే స్పందించడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతానికైతే అంతా సెట్ అయింది. కానీ సైఫ్ మనసులో మాత్రం భయం అలానే ఉండిపోయింది.
దుండగుడి దాడి వల్ల బాగా భయపడిపోయిన సైఫ్ అలీఖాన్.. ఇంకెప్పుడైనా తనపై దాడి జరగొచ్చేమో అనుకుని ఖతార్ దేశంలో ఇల్లు(New House) కొనుక్కున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే బయటపెట్టాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సైఫ్.. ఇల్లు కొనడానికి గల కారణాన్ని కూడా బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక)
'అది నా హాలీడే హోమ్. అక్కడ ఇల్లు కొనుక్కోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి జర్నీ సులభమవుతుంది. అక్కడ చాలా సేఫ్టీగా అనిపించింది. ఖతార్ అందమైన దేశం. అక్కడున్నప్పుడు చాలా రిలాక్స్ డ్ గా అనిపిస్తుంది. ఆ దేశంలో ఓ ఇంటికి మరో ఇంటికి చాలా దూరం ఉంటుంది. రీసెంట్ గా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు వాతావరణం కూడా అద్భుతంగా అనిపించింది. దీంతో అక్కడ ఇల్లు కొనేశాను. త్వరలో నా కుటుంబాన్ని కూడా అక్కడికి షిఫ్ట్ చేసేస్తా' అని సైఫ్ చెప్పుకొచ్చాడు.
సైఫ్ విషయానికొస్తే.. చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు వరకు హీరోగా చేశాడు. ఇప్పుడు మాత్రం విలన్, సహాయ పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. ఇతడికి తొలి భార్య వల్ల సారా అలీఖాన్, ఇబ్రహీం సంతానం కలిగారు. కరీనా కపూర్(Kareena Kapoor)ని రెండో పెళ్లి చేసుకోగా.. ఇద్దరు కొడుకులు పుట్టారు. ఇకపోతే సైఫ్ నటించిన జ్యూయెల్ థీప్ మూవీ.. ఏప్రిల్ 25న నెట్ ఫ్లిక్స్ లో నేరుగా రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: తల్లిదండ్రులయిన నటుడు విష్ణు విశాల్, జ్వాలా గుత్తా)