భార్యతో కలిసుండలేనన్న హీరో | I was never with Shweta: Pulkit Samrat | Sakshi
Sakshi News home page

భార్యతో కలిసుండలేనన్న హీరో

Published Mon, Jul 11 2016 10:35 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

భార్యతో కలిసుండలేనన్న హీరో

భార్యతో కలిసుండలేనన్న హీరో

ముంబై: తన భార్య శ్వేత రొహిరతో కలిసుండలేనని బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్ స్పష్టం చేశాడు. తమ వివాహ బంధం తెగిపోయిందని ప్రకటించాడు. శ్వేతకు అతడు దూరం కావడానికి హీరోయిన్ యామి గౌతమ్తో ఉన్న సాన్నిహిత్యమే కారణమని ఆరోపణలు వచ్చాయి. అయితే తన భార్యకు గర్భస్రావం అయినప్పటి నుంచే శ్వేతకు అతడు దూరమవుతూ వచ్చాడని తాజాగా వెల్లైంది. ఈ ఆరోపణలను అతడు తోసిపుచ్చాడు.

‘ఈ వార్త చదివి షాక్కు గురైయ్యాను. ఇది మా వ్యక్తిగత విషయం. మా ఇద్దరికీ అది చాలా బాధ కలిగించింది. మాతృత్వం ఎవరికైనా వరమే. కానీ తప్పాంతా నాదే అయినట్టు బురద చల్లుతున్నారు. ఎవరేం మాట్లాడినా ఇన్నాళ్లు సహించాను. నిజమేంటే బయట పెట్టేస్తా. శ్వేతకు గర్భస్రావం జరిగి నాలుగేళ్లైంది. అప్పటికీ యామి గౌతమ్ ఎవరో నాకు తెలియదు. సానుభూతి పొందేందుకు నా ఇమేజ్ ను శ్వేత దెబ్బతీస్తొంది. వ్యక్తిగత విషయాలను బహిరంపరచి రచ్చ చేస్తోంది. ఆమె ఈవిధంగా ప్రవర్తిస్తుందని ఊహించలేదు. ఇక ఆమెతో ఎటువంటి సంప్రదింపులు సాగించను. శ్వేతతో నా వివాహ బంధం ముగిసినట్టే’నని పులకిత్ సామ్రాట్ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement