
అభిమానులున్నా అవకాశాల్లేవ్
అభిమానంలో చాలా రకాలున్నాయి. అలాంటి కట్టలు తెంచుకున్న అభిమానంతో నటులు అవస్థలు పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఆఫ్‌కోర్సు అభిమానులు ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు అధికంగానే ఉన్నా యి. ఇక అలాంటి వీరాభిమానంతో ఇటీవల తలనొప్పికి గురవుతున్న నటి యామి గౌతమ్. తెలుగు, తమిళం భాషల్లో రూపొందిన గౌరవం చిత్రం ద్వారా పరిచయం అయిన ఈ ఉత్తరాది బ్యూటీ అవకాశాలు మాట ఎలా ఉన్నా అభిమానులు గోల మాత్రం అధికంగానే ఉందట.
ప్రస్తుతం తమిళ్ సెల్వమ్, తనియార్ అంజలుమ్ చిత్రంలో నటిస్తున్న యామి హిందీలో నటిస్తున్నారు. అలాగే వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ అభిమానులకు దగ్గరవుతున్న యామిగౌతమ్ పేరును తనను పిచ్చిగా ఆరాధించే అభిమాని ఒకరు పచ్చబొట్టుగా పొడిపించుకుని రోజు ఆమె షూటింగ్ జరిగే స్పాట్‌కు వెళ్లడం మొదలెట్టారట. అతని ప్రవర్తన చూసిన కొందరు ప్రశ్నించగా తాను యామిని ప్రేమిస్తున్నానన్నది ఆమెకు తెలియాలని రోజు ఆమె షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళుతున్నానని బదులిచ్చారట.
ఈ వీరాభిమాని వింత చేష్టలు మొత్తానికి యామి దృష్టికి చేరాయట. ఆశ్చర్యం, దిగ్భ్రాంతులతో కూడిన విస్మయానికి గురైన యామి ఇలాంటి చర్యలు బాధాకరం అంటూ అతనికి హిత వ్యాఖ్యలు చెప్పి పంపించే సిందట. ఇలాంటి అభిమానులు విపరీత చర్యలు ఈ భామకు కొత్తేమి కాదట. ఇంతకుముందొక అభిమాని తన అందమైన రూపాన్ని భారీ సైజ్ క్యాన్వాస్‌పై చిత్రీకరించి ఆమెను కలిసి యమ ఖుషి అయిన ఆ పెయింటింగ్‌ను బహుకరించారట. అయితే ఇలాంటి అభిమానులను కలిగిన తనకు అవకాశాలు మాత్రం ఎందుకు రావడం లేదని యామి తన సన్నిహితుల వద్ద వాపోతోందట.ఇంతకీ ఈ భామకు అవకాశాలు వస్తాయో లేదో వేచి చూద్దాం.