
రొమాంటిక్ కొరియర్ బోయ్
ప్రేమకథలైనా, యాక్షన్ కథలైనా తన దైన శైలిలో డీల్ చేస్తూ తమిళ, తెలుగు భాషల్లో అభిమానులను సంపాదించుకున్న దర్శకుడు గౌతమ్ మీనన్. నిర్మాతగా కూడా ఆయనది ప్రత్యేకమైన శైలి. నితిన్‌తో ఆయన ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ చిత్రాన్ని నిర్మించారు.
నితిన్, యామీ గౌతమ్ జంటగా గురు ఫిలింస్ పతాకంపై మల్టీడెమైన్షన్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం పాటల వేడుక ఈ నెల 23న జరగనుంది.
గౌతమ్ మీనన్ మాట్లాడుతూ -‘‘కొరియర్‌బాయ్‌గా పనిచేసే ఓ యువకుని జీవితంలో జరిగిన సంఘటనలే ఈ చిత్రం.రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్య పోన్‌మార్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్.