
పుట్టిన ప్రతి ఒక్కరికీ ఎదో ఒక వ్యాధి లేక లోపం ఉండడం సాధారణం. కానీ వాటిని పబ్లిక్‌గా చెప్పడానికి భయపడుతుంటారు. దానికి సెలబ్రీటీలు అతీతులేం కాదు. తాజాగా బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తనకున్న అరుదైన వ్యాధి గురించి బయటికి చెప్పింది.
‘కెరటోసిస్ పిలారిస్’ అనే అరుదైన చర్మ వ్యాధితో తాను బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా యామీ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఎడిట్ చేయని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతూ, దాన్ని దాచడానికి ఎంతో ప్రయత్నించా. కానీ అందరూ అనుకునేంతా భయంకరమైన వ్యాధి ఏం కాదు. చాలా సార్లు నీ వ్యాధి గురించి చెప్పడానికి ఎందుకు ఇబ్బందిపడుతున్నావని నన్ను నేనే అడిగేదాన్ని. అందుకే ఇప్పుడు ధైర్యంగా అందరికి చెబుతున్నా’ అని ఈ బ్యూటీ వ్యాధి గురించి తెలిపింది. ఈ వ్యాధికి ఇంతవరకు చికిత్స కనుక్కొలేకపోయారని నటి చెప్పింది.
ఈ విషయాన్ని అందరికి చెప్పిన తర్వాత నా భయాలు, అభద్రతలను జయించినట్లుగా భావిస్తున్నానని యామీ పేర్కొంది. చివరికి తనలోని లోపాలను ప్రేమించే మార్గాన్ని కనుగొన్నట్లు ఈ భామ తెలిపింది. ‘కెరటోసిస్ పిలారిస్’ అనే చర్మ వ్యాధి వల్ల ఒంటిపై కురుపుల వంటి బొడిపెలు ఏర్పడుతుంటాయి.
చదవండి: ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ప్రేమలో పడ్డా : హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment