
యుద్ధం సిద్ధం!
తరుణ్, యామీ గౌతమ్ జంటగా రూపొందిన చిత్రం ‘యుద్ధం’. ‘ఎవరితోనైనా’ ఉపశీర్షిక. భారతీ గణేశ్ దర్శకుడు. నట్టి కుమార్, నట్టి లక్షీ్ష్మ నిర్మాతలు. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
సి.కల్యాణ్ ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని జిట్టా సురేంద్రరెడ్డికి అందించారు. పాటలతో పాటు సినిమా కూడా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కుటుంబ విలువలతో కూడిన ఈ చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేస్తున్నామని నట్టికుమార్ చెప్పారు. తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని తరుణ్ నమ్మకం వ్యక్తం చేశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుందని, ప్రతి ఒక్కర్నీ ఆలోచింపజేసే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు.