పెళ్లి అనేది హీరోయిన్స్‌ కెరీర్‌కి అడ్డంకి? యామీ గౌతమ్‌ ఏం చెప్పిందంటే.. | Yami Gautam Interesting Comments On Heroines Career After Marriage | Sakshi
Sakshi News home page

Yami Gautam: పెళ్లి తర్వాత హీరోయిన్స్‌ కెరీర్‌ ముగిసినట్టేనా? యామీ గౌతమ్‌ ఏమన్నదంటే..

Published Sun, Dec 11 2022 4:13 PM | Last Updated on Sun, Dec 11 2022 4:18 PM

Yami Gautam Interesting Comments On Heroines Career After Marriage - Sakshi

‘గౌరవం’ మూవీతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన బ్యూటీ యామీ గౌతమ్‌. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొంతకాలంగా ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌తో ఆమె బాగా ఫేమస్‌ అయ్యింది. ఈ క్రమంలో తెలుగు, పంజాబీ చిత్రాల్లో అవకాశాలు అందుకున్ను ఆమె ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా మారింది. ఈ నేపథ్యంలో గతేడాది రచయిత, డైరెక్టర్‌ ఆదిత్య ధర్‌ని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె అదే జోరు కొనసాగిస్తుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది.

ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన వైవాహిక జీవితం, సినీ కెరీర్‌ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్‌ కెరీర్‌ ముగుస్తుందని అంటారు, మరి నటిగా బిజీగా ఉన్నపుడే మీరు పెళ్లి చేసుకున్నారని, పెళ్లి అనంతరం సినీ కెరీర్‌ ఎలా ఉందనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి యామీ గౌతమ్‌ స్పందిస్తూ.. పెళ్లి అనంతరం కెరీర్‌ ముగిసిందనుకుంటే అది పోరపాటే అని సమాధానం ఇచ్చింది. ‘పెళ్లి తర్వాత హీరోయిన్స్‌ కెరీర్ ముగిసినట్టే అనుకోవడం పోరపాటు. హీరోయిన్ల కెరీర్‌కి పెళ్లి అనేది అడ్డు కాదని గ్రహించాలి. ఇప్పటికే ఈ విషయాన్నీ చాలామంది హీరోయిన్స్ ప్రూవ్ చేశారు.

పెళ్లి తర్వాత కూడా స్టార్‌ నటిగా రాణిస్తున్న హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. ప్రతి మహిళ తన లైఫ్‌లో ఎన్నో చేయాలని అనుకుంటుంది. పెళ్లి అయిన తర్వాత ఒక మహిళగా బాధ్యత పెరుగుతుంది.  వారికి తగినవాడు, వారి ఆలోచనలను గౌరవించే భర్త దొరికితే రెండింతలు ఉత్సాహంతో ముందుకు సాగవచ్చు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కెరీర్‌ణి చూసుకోవచ్చు. నా భర్త కూడా పరిశ్రమకు చెందిన వాడే కావడంతో ఆయన నాకు సపోర్ట్‌ చేస్తున్నారు. అందుకే నేను సినిమాలు చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా యామీ గౌతమ్‌ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.  

చదవండి: 
అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్‌
నడిరోడ్డుపై సెలబ్రిటీ జంటపై వేధింపులు, పోలీసులపై నటి అసహనం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement