Dasvi: Yami Gautam Extremely Upset On Negative Reviews, Calls it Heartbreaking Viral - Sakshi
Sakshi News home page

Yami Gautam: నా గుండె ముక్కలయ్యింది, దయచేసి ఆ పని చేయకండి

Published Fri, Apr 8 2022 9:29 PM | Last Updated on Sat, Apr 9 2022 11:52 AM

Dasvi: Yami Gautam Extremely Upset On Negative Reviews, Calls it Heartbreaking - Sakshi

అభిషేక్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌, యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దస్వీ. ఏప్రిల్‌ 7న ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్‌, జియో సినిమా)లో రిలీజైందీ మూవీ. ఈ క్రమంలో ఓ బాలీవుడ్‌ వెబ్‌సైట్‌ యామీ నటన గురించి తన రివ్యూలో ప్రస్తావించింది. ఇన్నాళ్లుగా చేసిన సాధారణ ప్రియురాలి పాత్రలకు ఈ సినిమాతో యామీ చెక్‌ పెట్టిందని, ఇందులో ఆమె నటన పర్వాలేదని రాసుకొచ్చింది. అంటే ఇంతకాలంగా యామీకి అసలు నటించడమే రాలేదన్నట్లుగా పేర్కొంది. ఈ రివ్యూ చదివిన యామీ తన మనసు ముక్కలైందంటూ సోషల్‌ మీడియాలో వాపోయింది. తనను అగౌరవపర్చారంటూ బాధపడింది.

'విమర్శలను స్వీకరిస్తాను. అందులో తప్పొప్పులను సరి చేసుకుంటాను. కానీ కావాలని టార్గెట్‌ చేస్తూ నన్ను దిగజార్చాలని చూస్తున్నారు. అలాంటప్పుడు వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఎ థర్స్‌డే, బాలా, ఉరి సినిమాల్లో నా పర్ఫామెన్స్‌ను కూడా విమర్శిస్తున్నారు.  సొంతంగా ఎదిగిన నాలాంటి యాక్టర్స్‌కు మళ్లీ మళ్లీ నిరూపించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి. నిజంగా నా గుండె ముక్కలయ్యింది. ఒకప్పుడు మీ సైట్‌ను ఫాలో అయ్యేదాన్ని. కానీ ఇప్పుడదిక అవసరం లేదనిపిస్తోంది. దయచేసి మీరు నా సినిమాల గురించి, నా పర్ఫామెన్స్‌ గురించి రివ్యూ ఇవ్వకండి' అని ఫైర్‌ అయింది యామీ గౌతమ్‌.

చదవండి: మందుగ్లాసు పట్టుకున్న వర్మకు ముద్దు పెట్టిన హీరోయిన్‌

దస్వీ చిత్రం రివ్యూ.. ఎలా ఉందంటే ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement