
ఆశిస్తే అందేది కాదది
ఆశిస్తే అందేది కాదు విజ యం అంటున్నారు యువ నటి యామి గౌతమ్. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ అంటూ పలు భాషల్లో హీరోయిన్‌గా ఒక్కో మెట్టు ఎదుగుతున్న ఈ బ్యూటీ తమిళం, తెలుగులో గౌర వం చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. తాజాగా మళ్లీ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజలుమ్ అనే పేరును తెలుగులో కొరియర్ భాయ్ కల్యాణ్ పేరును నిర్ణయించారు. ఈ చిత్రం పాట చిత్రీకరణ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా యామిగౌతమ్‌తో కొన్ని ముచ్చట్లు. గౌరవం చిత్రం ఆశించిన విజయం సాధించిందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ బదులిస్తూ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదన్నారు.
అయితే మనకిచ్చిన పాత్రను న్యాయం చేసే ప్రయత్నం చేయాలన్నారు. తన తొలి చిత్రం విక్కిడోనర్ (హిందీ) మంచి చిత్రం అవుతుందని భావించాను గానీ అంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదన్నారు. అందుకే సక్సెస్ అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదన్నారు. ఉత్తరాది, దక్షిణాది చిత్రాలంటూ తేడాలు తనకు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో హిందీలో తెరకెక్కుతున్న కమర్షియల్ చిత్రం యాక్షన్ జాక్సన్, తమిళం, తెలుగు భాషల్లో తమిళ సెల్వన్ తనియార్ అంజలుమ్‌గా విడుదల కానుందన్నా రు. తాను మోడలింగ్ నుంచి వచ్చానని చెప్పారు. తొలి రోజుల్లోనే ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్‌తో కలసి పని చేయడం అదృష్టమన్నారు. ఏఆర్ రెహ్మాన్ రూపొం దించిన రౌనక్ వీడియో ఆల్బమ్‌లో నటించిన అనుభవాన్ని ఎప్పటికీ మరచిపోలేనని చెప్పారు.