Courier Boy Kalyan
-
మేకింగ్ ఆఫ్ మూవీ - కొరియర్ బాయ్ కళ్యాణ్
-
కంటెంట్ నమ్మిన కొరియర్...
ఇవాళ ఆధునిక ప్రపంచంలో రకరకాల వైద్య పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ, అలాంటి పరిశోధనల్లో కొన్నింటి కోసం జనం నమ్మకాన్ని వమ్ము చేసి ద్రోహానికి పాల్పడితే? అలాంటి అక్రమం అనుకోకుండా బయటపడితే? ఒక సామాన్యుడు తన డ్యూటీ తాను సక్రమంగా చేసే క్రమంలో సమాజానికి తోడ్పడే కథానాయకుడిగా పరిణమిస్తే? ఈ సింపుల్ పాయింట్‌ను జెట్ స్పీడ్‌లో కాకుండా... కొరియర్ స్పీడ్‌లో చెప్పిన ప్రయత్నం - ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. హీరో నితిన్ ఒక కొత్తరకం కథను ట్రై చేశాడు. అందుకు కారణం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన క్రియేటివ్ డెరైక్టర్ గౌతమ్ మీనన్ కావచ్చు. రకరకాల కారణాల వల్ల ప్రొడక్షన్లో జాప్యం జరిగి రెండున్నర ఏళ్ల కాలం తీసుకున్న ఈ సినిమా వినాయక చవితికి విడుదలయ్యింది. కొరియర్ చుట్టూ తిరిగే కథ కల్యాణ్ (నితిన్) ఒక మామూలు మధ్యతరగతి కుర్రాడు. చిన్నప్పటి నుంచి అక్క (సురేఖావాణి) చాటున పెరుగుతాడు. కొరియర్ సర్వీస్ ఆఫీసులో పనిచేసే స్నేహితుడు (‘సత్యం’ రాజేష్) హీరోకు తోడు. స్నేహితుడి బదులు అనుకోకుండా కొరియర్ ఇవ్వడానికి వెళ్ళి, ఖాదీ భండార్‌లో పనిచేసే సూపర్వైజర్ గర్ల్ కావ్య (యామీ గౌతమ్)ను చూస్తాడు. చూడగానే ప్రేమలో పడతాడు. ఆమెకు వారానికి రెండో మూడో కొరియర్లు రాకపోతాయా, వాటిని ఇచ్చే మిషతో ఆమెకు దగ్గర కాకపోతానా అనే ఆలోచనతో అంతకు ముందు వద్దనుకున్న కొరియర్ బాయ్ ఉద్యోగంలో చేరతాడు. సినిమాకు మెయిన్ పాయింట్ మాత్రం మరోచోట ఉంటుంది. ఎక్కడో బుకారెస్ట్‌లో పరిశోధనలు చేస్తుంటాడు ఒక డాక్టర్ (అశుతోష్ రాణా). చూపు పోయిందనుకున్న వాళ్ళకు కూడా తన పరిశోధన ద్వారా చూపు తెప్పిస్తాడు. అయితే, ఆ పరిశోధన క్రమంలో అతని హాస్పిటల్లో గర్భవతులకు అర్ధంతరంగా అబార్షన్లు అవుతుంటాయి. ఆ అబార్షన్లకూ, ఈ పరిశోధనకూ చిత్రమైన సంబంధం ఉంటుంది. కోట్ల డాలర్లు సంపాదిస్తున్న ఆ డాక్టర్ అక్కడ పోలీసులు, దర్యాప్తుల గోల నుంచి తప్పించుకొనేందుకు మకాం ఇండియాకు మార్చేస్తాడు. హైదరాబాద్ కేంద్రంగా కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతూ, తన పరిశోధన కోసం అబార్షన్ల రాకెట్‌ను గుడివాడ లాంటి చిన్న ఊళ్ళతో సహా తెలుగు నేల అంతటా విస్తరింపజేస్తాడు. ఆ అబార్షన్ల వెనుక ఉన్న రహస్యం ఏమిటన్నది గుడివాడ హాస్పిటల్‌లోని వార్డ్బాయ్ మాణిక్యం (‘అమృతం’ సీరియల్ ఫేమ్ వాసు ఇంటూరి)కి అనుకోకుండా తెలుస్తుంది. దాంతో ఆ వార్డ్బాయ్ ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలో అవినీతి, అక్రమాలపై నిస్వార్థంగా పోరాడే హైదరాబాద్‌లోని సోషల్‌వర్కర్ సత్యమూర్తి (నాజర్)కి చేరవేయడానికి ప్రయత్నిస్తాడు. మందు చీటీల ప్రిస్క్రిప్షన్లు, గర్భవతులకు డాక్టర్లిస్తున్న అనుమానాస్పద ట్యాబ్లెట్ల సీసా కొరియర్ చేస్తాడు. హైదరాబాద్‌కు వెళ్ళిన ఆ కొరియర్ సంగతి విలన్ డాక్టర్ల బృందానికి తెలుస్తుంది. ఆ కొరియర్ డెలివరీ అనుకోకుండా మన కథానాయకుడు కల్యాణ్ పని కింద పడుతుంది. ఆ కొరియర్ గమ్యానికి చేరకూడదనీ, చేరినా వ్యవహారం సత్యమూర్తి ద్వారా మీడియాకు పొక్కకూడదనీ విలన్లు తంటాలు పడుతుంటారు. ఆ కథ తెలియని మన కొరియర్ బాయ్ కళ్యాణ్‌కు అసలు సంగతి ఎలా తెలిసింది? తెలిశాక ఏం చేశాడు? ఏమైందన్నది మిగతా సినిమా. గర్భస్రావాలకు లింక్ అయిన ఆ పరిశోధన ఏమిటన్న పాయింట్ తెరపై చూడాల్సిన సస్పెన్స్ పాయింట్. డ్యాన్స్... కెమేరా... యాక్షన్... హీరో ఇమేజ్ ఉన్న నితిన్ ఈ కామన్‌మ్యాన్ క్యారెక్టర్లో ఇమిడిపోవడానికి బాగానే ప్రయత్నించారు. కొన్ని సీన్స్‌లో అతని నటన, ముఖ్యంగా పాటల్లో వేసిన స్టెప్పుల కోసం అతను పడిన శ్రమ బాగుంది. ఖాదీ దుస్తుల సేల్స్‌గర్ల్‌గా యామీ గౌతమ్ పెద్దగా చేయడానికి ఏమీ లేదు. హర్షవర్ధన్, సురేఖావాణి పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక, ‘సత్యం’ రాజేశ్‌తో పాటు సప్తగిరి, ‘గుండు’ సుదర్శన్, దువ్వాసి మోహన్, జెన్నీ లాంటి సుపరిచిత నటులు ఉన్న ఒకటి, రెండు సీన్స్‌లోనే కాసేపు వినోదం అందిస్తారు. యాక్షన్ సీన్లు, సెకండాఫ్ బైక్ ఛేజ్ సీన్ టెంపోతో నడుస్తుంది. కెమేరా వర్క్ కూడా బాగుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని షాట్లు, సీన్లో తానూ భాగమే అన్నట్లుగా కెమేరాతో పాటు ప్రేక్షకుల కళ్ళు ప్రయాణిస్తాయి. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాకు కేవలం సమర్పకుడు, నిర్మాతే. కానీ, పబ్లిసిటీ చూసి ఆయన తరహా లవ్‌స్టోరీనో, యాక్షనో ఆశిస్తే చిక్కే! తమిళ టీవీ నటుడు ప్రేమ్‌సాయికి దర్శకుడిగా ఇదే తొలి సినిమా. రెండు భాషల్లో వేర్వేరు హీరోతో చేసిన ఈ ద్విభాషా చిత్రంలో తమిళ వాసన కనిపించకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. కథకు కీలకమైన పాయింట్ ఏమిటనేది - టైటిల్స్ పడుతున్నప్పటి నుంచి సినిమా ఫస్టాఫ్ అంతటా ఒకటికి రెండు సంఘటనల ద్వారా చెబుతూ వచ్చారు. దాంతో, ఆ పాయింట్‌ను ఇంటర్వెల్ ముందు బయటపెట్టే సరికల్లా ప్రేక్షకుడు కూడా మానసికంగా ఒక క్లారిటీతో ఉంటాడు. సరైన టైమ్ చూసుకొని ఇంటర్వెల్ పడుతుంది. ఆ క్రమంలో ఆ కీలకమైన విషయం ఎలా బయటకొచ్చింది, అందుకోసం హీరో ఎలా పోరాడాడన్నవే సెకండాఫ్ ముప్పావు గంట! అయితే, క్లైమాక్స్‌కు వచ్చేసరికి కథ చాలా సింపుల్‌గా, అర్ధంతరంగా ముగించారేమోనన్న భావన కలిగే అవకాశం ఉంది. హీరో పాత ప్రొఫెషన్ తాలూకు నైపుణ్యాన్ని ఆఖరు క్షణంలో వాడటం బాగుంది. అక్క సెంటిమెంట్ అదనం చాలా చిన్న పాయింట్‌తో వచ్చిన ఈ చిన్న సినిమా నిడివి పరంగా కూడా చిన్నదే. నిజానికి ఈ కథకు బలమైన సెంటిమెంటల్ కోణం- హీరో అక్కాబావలకు కూడా పన్నెండేళ్ళుగా పిల్లలు పుట్టకపోవడం. రాక రాక గర్భం దాల్చిన హీరో అక్కకు కూడా విలన్ డాక్టర్ గర్భస్రావమయ్యే ఆ ట్యాబ్లెట్ల సీసా ఇవ్వడం! డాక్టరిచ్చిన ఆ మందు వేసుకోమని హీరోయే తన అక్క చేతికి ఇవ్వడం! ఈ సెంటిమెంటల్ ట్రాక్‌ను దర్శక-రచయిత ఎందుకనో పెద్దగా వాడుకోలేదు. దాన్ని కొంత పొడిగిస్తే, సినిమాకు లెంగ్త్‌తో పాటు లేడీస్ సెంటిమెంట్ కూడా బాగానే కలిసొచ్చేది. కాసేపు కాలక్షేపం కోసం వెళితే మాత్రం ఈ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఆశాభంగం చేయడు. ఇవాళ ఆ మాత్రం కరుణ చూపినా, ప్రేక్షకులు పరమానందభరితులై సినిమా చూసేస్తున్నారు కాబట్టి, ఈ సినిమాకే కాదు... పరిశ్రమ పచ్చగా కళకళలాడడానికీ అది ఉపయోగమే! -
టిక్కెట్లు కొరియర్ చేస్తాడా?
కస్టమర్ : హలో... కొరియర్ సర్వీస్? కల్యాణ్ : ఎస్ మేడమ్. కస్టమర్ : (సిగ్గుపడుతూ) కల్యాణ్ ఉన్నాడా? కల్యాణ్ : (ఆటపట్టించడానికి) ఇవాళ వీక్లీ ఆఫ్ మేడమ్. కస్టమర్ : అయ్యో! కల్యాణ్ : ఏం మేడమ్? నన్ను మెసేజ్ పాస్ చెయ్యమంటారా? కస్టమర్ : ఊ... హు... (మొహమాటపడుతూ, వంకర్లు తిరుగుతూ) కల్యాణ్ : పర్సనలా మేడమ్? (నవ్వుకుంటూ) కస్టమర్ : నీ క్లోజ్ ఫ్రెండా? కల్యాణ్ : వెరీ క్లోజ్ (ముసిముసిగా నవ్వుకుంటూ) కస్టమర్ : ఫ్రైడే బిజీగా ఉంటాడా? కల్యాణ్ : ఎందుకు మేడమ్? కస్టమర్ : నితిన్ సినిమా రిలీజ్ అవుతోందిగా... వస్తాడేమోనని! కల్యాణ్ : వాడితోనే మీకు టిక్కెట్లు కొరియర్ చేయిస్తా మేడమ్! ఆల్ ది బెస్ట్!! ఎంజాయ్!!! రాఘవేంద్రరావు దగ్గర నుంచి వర్మ, కృష్ణవంశీ, రాజమౌళి, వినాయక్, త్రివిక్రమ్ దాకా - అగ్ర దర్శకులందరితో పనిచేసిన హీరో మీరొక్కరే! (సంతోషంగా...) అవును. అది నా అదృష్టం. వాళ్ళది ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. రాఘవేంద్రరావు గారు ఎంత ప్లాన్డ్ అంటే, ఏ ఆర్టిస్ట్ ఏ టైమ్‌కి వచ్చి, ఏ టైమ్‌కి వెళ్ళిపోవాలన్నా సరే - కాంబినేషన్ షాట్స్ కూడా ప్లాన్ చేసి, తీసి పంపేస్తారు. రాజమౌళి గారి ఎంతసేపటికీ పని... పని... పని... ఉదయం 7 గంటల కల్లా ఫస్ట్ షాట్ తీసేస్తారు. ప్యాకప్ టైమ్ దాకా పని చేస్తారు, చేయిస్తారు. వర్మది మరో స్టైల్. ఆర్టిస్ట్‌ను వదిలేసి, స్వేచ్ఛగా చేయమంటారు. ఈ దర్శకులందరి నుంచి చాలా నేర్చుకున్నా. ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ ఎట్టకేలకు రిలీజవుతోంది. ఎలా ఉంది? నితిన్: ఇది కమర్షియల్ సినిమానే అయినా, డిఫరెంట్ ప్యాట్రన్‌లో ఉండే సినిమా. షాకింగ్‌గా అనిపించే కొత్త పాయింట్. ఐటమ్ సాంగ్‌లు, సెపరేట్ కామెడీ లాంటి జిమ్మిక్కులతో కాకుండా, కథను నమ్ముకొని తీసిన సినిమా. హిట్లు, ఫ్లాప్‌లు నాకు కొత్త కాదు. కెరీర్లో నేను చూసినన్ని ఫ్లాప్‌లు ఎవరూ చూడలేదు. కాకపోతే, ఇలాంటివి ఆడితే, కొత్త కథలు చేయడానికి ధైర్యం వస్తుంది. ఇప్పుడు రిలీజ్ టైమ్‌లో కొంచెం టెన్షన్‌గానే ఉంది. రెండున్నరేళ్ళ క్రితం మొదలెట్టిన సినిమా. ఆ పాయింట్ పాతబడిపోలేదా? మూడేళ్ళ క్రితం కథ విన్నప్పుడు కొత్తగా ఉన్న ఆ పాయింట్ ఇప్పటికీ కొత్తదే. సినిమా ఆలస్యం కూడా ఒకందుకు మంచికే అయిందేమో! అప్పుడె వరికీ తెలియని, అర్థం కాని విషయం ఇటీవల మీడియా వల్ల తెలుస్తోంది. దాని ‘యూట్యూబ్’ వీడియో సినిమా రిలీజయ్యాక చెబుతా. ఇంత లేటవుతుంటే, ప్రాజెక్ట్ పైన మీ ఫోకస్ ఎలా నిలుపుకొన్నారు? తెలుగులో నాతో, తమిళంలో హీరో జైతో ఏకకాలంలో రెండు భాషల్లో తీసిన ఈ సినిమాలో నా పని ఏడాది క్రితమే అయిపోయింది. కాకపోతే, తమిళ వెర్షన్‌కు ఉన్న ఆర్థిక సమస్యల వల్ల రిలీజ్ లేట్. ఈ కథ, ఇందులోని మంచి పాయింటే నా ఏకాగ్రత పోకుండా చేసింది. మీరు పవన్ కల్యాణ్ ఫ్యాన్ కాబట్టి, సినిమా పేరు మీరే సజెస్ట్ చేశారట! అదేమీ లేదండీ! త్రివిక్రమ్ గారితో నేను చేస్తున్న సినిమాకు ‘అ...ఆ...’ అని పేరు పెడితే, పవన్ కల్యాణ్ అలా ‘అ...ఆ...’ అని అంటూ ఉంటాడు కాబట్టే, ఆ పేరు పెట్టారని ఎవరో రాశారు. ఏం చెబుతాం చెప్పండి! ఈ సినిమాకు ‘కొరియర్ బాయ్ కార్తీక్, కల్యాణ్’లలో ఏదో ఒకటి పెట్టాలని దర్శక, నిర్మాతలు అనుకున్నారు. రెండూ చెప్పారు. మీ ఇష్టం అన్నా. {పొడ్యూసర్ల కష్టాలు తెలిసిన మీరు సహాయం అందించి ఉండచ్చుగా! ఒక దశలో అడిగా. చెరి సగం ఖర్చు పెడదామన్నా. పోనీ, తెలుగు వెర్షన్ వరకు నాకే పూర్తిగా ఇచ్చేయమన్నా. కానీ, కథ మీద నమ్మకంతో దర్శక, నిర్మాతలు అలా చేయలేదు. అందుకే, ఇప్పుడు నేను చేయగలిగిందల్లా వీలైనంత పబ్లిసిటీ ఈవెంట్స్‌లో పాల్గొనడం. అదే చేస్తున్నా. దర్శకుడు ప్రేమ్‌సాయి కన్నా, మీరు, గౌతమ్ మీననే ఎక్కువగా పబ్లిసిటీలో కనిపిస్తున్నారు. తీరా, ఇది గౌతమ్ సినిమా అనుకుంటారేమో! ప్రేమ్‌సాయి కొత్తవాడు కాబట్టి, నాతో పాటు గౌతమ్ లాంటి తెలిసిన పెద్ద పేరుంటే బాగుంటుందని మేమిద్దరం చేస్తున్నాం. గౌతమ్ మీనన్ సినిమాల తరహా సెన్సిబిలిటీస్ దీనిలోనూ ఉన్నాయి. కాబట్టి ఇబ్బంది లేదు. ఇంతకీ సినిమా ఎలా ఉంటుందన్నదైనా ఒకటి,రెండు ముక్కల్లో చెప్పండి! ‘జయం’లోలా అనుకోని పరిస్థితుల్లో సామాన్యుడెలా హీరో అయ్యాడన్నది కథ. కొత్తదనం ఆకట్టుకుంటుంది. ఇది కచ్చితంగా డెరైక్టర్స్ ఫిల్మ్. {తివిక్రమ్‌తో ప్రాజెక్ట్ ఎలా కుదిరింది? ‘అ..ఆ..’ సంగతులేంటి? ‘గుండె జారి గల్లంతయ్యిందే’ టైమ్‌లో ఆయన, నేను సినిమా చేద్దామనుకున్నాం. తీరా అది కుదరలేదు. ఆయనా ఇప్పుడు ఒక మంచి ప్రేమకథ చేయాలనుకుంటున్నారు. ఆయనకూ, నాకూ డేట్స్ కలిశాయి. ఇప్పుడు కుదిరింది. అంతే తప్ప, ‘అ...ఆ...’ కథకు నేనేమీ ఆఖరు ఆప్షన్ కాదు. పూరీ జగన్ దర్శకత్వంలో మీ సినిమా ఆఖరిక్షణంలో ఆగిపోయిందేం? (కొద్దిగా ఇబ్బంది పడుతూ...) కొన్ని కారణాల వల్ల ఆఖరు క్షణంలో ఆ ప్రాజెక్ట్ ఆపేశాం. ఇప్పుడవన్నీ చర్చించడం ఎందుకు లెండి! దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో ఇప్పుడు మీ ఈక్వేషన్ ఎలా ఉంది? ఇప్పటికీ బయట కనిపిస్తే, హాయ్, హలో చెప్పుకుంటాం. కాకపోతే, ‘హార్ట్ ఎటాక్’ సినిమా అప్పుడు ఉన్నంత ఫ్రెండ్షిప్ మాత్రం మా మధ్య లేదు. ఏదో తెలియని ఒక చిన్న ‘ఇల్ ఫీలింగ్’ ఇద్దరి మధ్య వచ్చింది. మరి, మళ్ళీ ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ ఉందా? ఎందుకు లేదు! ఆయన మంచి స్క్రిప్ట్‌తో వస్తే, కచ్చితంగా నటిస్తా. నిజజీవితంలో సరే... సినీ రంగంలో మీకు బాగా ఫ్రెండ్స్ ఎవరు? హీరోలు అఖిల్, మంచు విష్ణు, నాని. అఖిల్‌కూ, మీకూ ఏజ్ గ్యాప్ ఉంది కదా! అసలెలా ఫ్రెండ్సయ్యారు? అయిదారేళ్ళ క్రితం ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ (సి.సి.ఎల్) తొలిసారిగా జరుగుతున్నప్పుడు మా మధ్య స్నేహం కుదిరింది. మా ఇద్దరి థికింగ్ దగ్గర నుంచి చాలా అంశాలు కలుస్తాయి. అలా ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఎంత ఫ్రెండ్ అయినా, అక్కినేని లాంటి పెద్ద కుటుంబం వారసుడి తొలి సినిమా ‘అఖిల్’ నిర్మించే ఛాన్సెలా వచ్చింది? ఆ ఐడియా ఎవరిది? అఖిల్ తొలి సినిమా మేమే చేద్దామన్న ఐడియా మా నాన్న గారిది. ‘మనం’ ప్రీమియర్ చూసినప్పుడే అనుకున్నాం. ఆ ఆలోచన, స్టోరీ, వి.వి. వినాయక్ డెరైక్షన్ - ఇలా అన్నీ చెప్పగానే అఖిల్ ఫాదర్ నాగార్జున గారు కూడా హ్యాపీగా ఒప్పుకున్నారు. సినిమా చాలా బాగా వస్తోంది. ‘అఖిల్’ సినిమాకు ఎక్కువ బడ్జెటైందట. తొలిచిత్ర హీరోకు అంత ఖర్చా? బడ్జెట్ ఎక్కువవడం ఏమీ లేదు. ఆ కథకు బాగా ఖర్చవుతుందని మేము ముందు నుంచి అనుకున్నదే! ఇంత ఖర్చు చేయడానికి కారణం - కథ మీద ఉన్న నమ్మకం. ఇది కేవలం భారీ సినిమా కాదు, భారీ స్టోరీతో ఉన్న సినిమా! దానికి తగ్గట్లే, రకరకాల దేశాల్లో షూటింగ్. కానీ, ప్రతి సినిమాకూ బడ్జెట్ పెంచుకుంటూ పోవడం కరెక్ట్ అంటారా? డెరైక్టర్ విజన్‌ను బట్టి, కథ డిమాండ్‌ను బట్టి, ఎవరి దమ్ము ఎంతో అంత ఖర్చు పెట్టడంలో తప్పు లేదు. బడ్జెట్ ఎంత పెట్టినా, అంతకు అంత డబ్బులు రావడం ‘బాహుబలి’ లాంటి సినిమాలతో జరుగుతోంది కదా! కానీ అన్ని టికెట్లూ ఒకే ధరకు ‘ఫ్లాట్ రేట్’లో అమ్మడం మంచిదంటారా? మంచి కాఫీ తాగాలంటే కూడా చాలా ఖర్చు చేస్తున్నప్పుడు, రెండున్నర గంటలు ఏసీలో ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా టికెట్ కేవలం డెబ్భై రూపాయలే అంటే ఎలా? ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో హైకోర్ట్ ఆర్డర్‌తో ఎక్కువ రేట్‌కి టికెట్లమ్ముతున్నారు. వైజాగ్‌లో త్వరలో అలా చేస్తారట. ఇంతకీ, నిర్మాతగా అనుభవమెలా ఉంది? ప్రొడక్షన్ కొనసాగిస్తారా? (నవ్వేస్తూ) బాబోయ్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ! వచ్చిన అనుభవం చాలు. మళ్ళీ అఖిల్ మూడో సినిమానో, నాలుగో సినిమానో నిర్మిస్తా. మీరు అభిమానించే పవన్ కల్యాణ్ సినిమా ప్రొడ్యూస్ చేసే ఛాన్సొస్తే...? (వెంటనే అందుకుంటూ...) తప్పకుండా చేస్తా. ఆయన డేట్లివ్వాలే కానీ, నావన్నీ కూడా మానుకొని మరీ ఆ సినిమా చేస్తా. ఈ పధ్నాలుగేళ్ళ కెరీర్లో మీరు బాగా ఆస్వాదించిన క్షణం? ‘ఇష్క్’ సినిమా సక్సెస్ అయిన క్షణం నా కెరీర్లో బెస్ట్ మూమెంట్. నా కెరీర్లో అది స్పెషల్ ఫిల్మ్. నా కెరీర్‌ను ‘ఇష్క్’కు ముందు, తరువాత అనుకోవచ్చు. కెరీర్ మొదట్లోనే ‘జయం’, ‘దిల్’, ‘సై’ లాంటి వరుస విజయాలు వచ్చినా, అప్పటికి సినీరంగంలో నాకేమీ తెలీదు. ఆ తరువాత దారుణమైన డౌన్‌ఫాల్ కూడా చూశా. ఆ క్షణంలో మళ్ళీ నాకు రెండో ఇన్నింగ్స్ ఇచ్చిన సినిమా - ‘ఇష్క్’. ‘జయం’తో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన తేజతో రిలేషనెలా ఉంది? నాకు ఈ ఫేమ్ వచ్చిందంటే ఆయన చలవే. నాకు ఆ కృతజ్ఞత ఉంది. తేజ తాను తీర్చిదిద్దిన హీరోలెవరూ తన ఫోనే తీయడం లేదంటున్నారే! ఆయన ఎవరికి ఫోన్ చేశారో! నాకైతే ఆయన నుంచి ఫోన్ రాలేదు. పోనీ, మీరు ఆయనకు ఫోన్ చేస్తుంటారా? లేదు. ‘ధైర్యం’ సినిమా తరువాత బయటే తప్ప, విడిగా మేము పెద్దగా కలిసిందీ, మాట్లాడుకున్నదీ లేదు. అయితే, ఇప్పటికీ ఆయన ఒక మంచి కథతో వస్తే, సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏడాది గ్యాప్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. స్పీడ్ పెంచారు. తప్పదు. డిసెంబర్లో వచ్చిన ‘చిన్నదాన నీ కోసం’ తర్వాత 6 నెలలు ఖాళీ. పూరీగారి సినిమా చేయాల్సింది. అది క్యాన్సిలయ్యేసరికి మళ్ళీ ఖాళీ. డల్ అయ్యా. ఇప్పుడు ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’ రిలీజ్. అక్టోబర్ 7 నుంచి ‘అ...ఆ...’ షూటింగ్. గౌతమ్ గారు చేస్తున్న నాగచైతన్య సినిమా అయిపోగానే, తెలుగు - తమిళాల్లో ఒక సినిమా చేయాలని ప్లాన్. - రెంటాల జయదేవ -
కొరియర్ బాయ్ కళ్యాణ్
ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి పని లేని కల్యాణ్ ఉరఫ్ పీకె... కొరియర్ బాయ్ అవతారం ఎత్తాడు. లవ్‌స్టోరీ క్లయిమాక్స్‌కు వచ్చిందన్న అతని ఆనందాన్ని ఓ కొరియర్ కవర్ ఆవిరి చేసింది. మరి.. ఆ కవర్లో ఏముందో ఈ నెల 17న నితిన్ వెండితెర మీద చెబుతానంటున్నారు. ఆయన హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ సమర్పణలో ప్రేమకథ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేమ్‌సాయి తెరకెక్కించిన చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. స్వతహాగా పవన్‌కల్యాణ్ అభిమాని అయిన నితిన్ ఈ చిత్రం టైటిల్‌ని ఎంతో ఇష్టంగా పెట్టుకు న్నారని, పవన్ అభిమా నులను అలరించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని గౌతమ్ మీనన్ చెప్పారు. -
కొరియర్ బోయ్ కళ్యాణ్ ట్రైలర్ విడుదల
ఒక వైపు నిర్మాతగా.. మరోవైపు హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు నితిన్. తాజా నితిన్ హీరోగా నటిస్తున్న 'కొరియర్ బోయ్ కళ్యాణ్' సినిమా ట్రైలర్ మంగళవారం సాయంత్రం విడుదలైంది. మహేశ్‌బాబు 'శ్రీమంతుడు' సినిమాతో స్ఫూర్తి పొందాడో ఏమో గానీ.. ఈ సినిమాలో నితిన్ కూడా సైకిల్ తొక్కాడు. హీరోయిన్ యామీ గౌతమ్ తన స్నేహితురాళ్లతో కలిసి ఆటోలో వెళ్తుండగా ఈ సైకిల్ తొక్కే సీన్ ఉంటుంది. ఎంట్రీలో నితిన్ చేతిలో ఓ కవర్ పట్టుకుని పరుగు పెడుతూ కనిపిస్తాడు. అతడిని ఓ నలుగురు వెంబడిస్తారు. తర్వాత విదేశాల్లో ఆస్పత్రి కేంద్రంగా జరిగే అక్రమం, ఆ తర్వాత అవినీతిపై పోరాడుతున్నట్లుగా కనిపించే నాజర్, ఇలాంటి సన్నివేశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాకు కార్తీక్, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రేమ్‌సాయి దర్శకత్వం వహిస్తున్నారు. -
కొరియర్ బాయ్ కళ్యాణ్ ట్రయిలర్ విడుదల!
-
కొరియర్ బాయ్ కళ్యాణ్ టీమ్‌తో ఇంటర్వ్యు
-
కొరియర్ బాయ్ పీకె
అనగనగా ఓ కొరియర్ బాయ్. కరడు గట్టిన పవన్‌కల్యాణ్ వీరాభిమాని. తనను అందరూ పీకే అని పిలవాలని కోరుకుంటాడు. అందరూ అతన్ని పీకే అనే పిలుస్తుంటారు. కానీ వాళ్ల దృష్టిలో పీకే అంటే పని లేని కల్యాణ్ అని. ఫ్లాష్‌బ్యాక్‌లో అతనికున్న పేరు ప్రతిష్ఠలు అలాంటివి. కేవలం ఒక అమ్మాయి కోసం ఆ ఉద్యోగంలో చేరతాడు. ఇక అక్కడి నుంచే అతనికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అతని జీవితాన్ని ఓ కొరియర్ కవర్ మలుపు తిప్పుతుంది. అక్కడి నుంచి అతను ఎలాంటి సాహసాలు చేశాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. దర్శకుడు గౌతమ్‌మీనన్ సమర్పణలో నితిన్, యామీ గౌతమ్ జంటగా వెంకట్ సోమసుందరం, రేష్మా ఘటాల, సునీత తాటి నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమ్‌సాయి దర్శకుడు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదల కానుంది. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ - ‘‘రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. ప్రేమ్‌సాయి బాగా తీర్చిదిద్దారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరినీ మెప్పించే సినిమా ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: సత్య పొన్మార్, రచనా సహకారం: కోన వెంకట్, హర్షవర్ధన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: స్వాతి రఘురామన్, విజయ్ శంకర్. -
‘కొరియర్ బాయ్ కల్యాణ్’ వర్కింగ్ స్టిల్స్
-
నితిన్‌కు లైన్ క్లియర్
నితిన్ హీరోగా నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. దాదాపు రెండేళ్ళ క్రితం మొదలై, షూటింగ్ పూర్తయినా రిలీజ్‌కు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్న ఈ సినిమాకు ఇప్పుడు లైన్ క్లియరైంది. ‘‘తమిళ వెర్షన్‌కు సంబంధించి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. అందుకే, ఇప్పుడు రిలీజ్ ప్లాన్‌లో పడ్డాం. ఈ నెల 19న తెలుగు వెర్షన్ పాటలు విడుదల చేస్తున్నాం. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ కానుంది’’ అని తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న ప్రముఖ దర్శక - నిర్మాత గౌతమ్ మీనన్ వెల్లడించారు. శనివారం నాడు హైదరాబాద్‌లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలు తెలిపారు. ప్రభుదేవా దగ్గర సహాయకుడిగా పనిచేసిన ప్రేమ్‌సాయి దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రంలో తెలుగు వెర్షన్లో నితిన్ హీరో అయితే, తమిళ వెర్షన్ ‘తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజలుమ్’(తమిళ్ సెల్వన్ - కొరియర్ సర్వీస్ అని అర్థం)లో జై కథానాయకుడు. రెండు వెర్షన్లలోనూ యామీ గౌతమ్ కథానాయిక. కథ ఒకటే... ట్రీట్మెంట్లు వేరు! చెన్నై నుంచి విమానంలో హైదరాబాద్‌కు వస్తూనే, నేరుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన గౌతమ్ మీనన్ విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, ‘‘ఫుల్ బౌండ్ స్క్రిప్ట్‌తో సిద్ధమై, ప్రేమ్‌సాయి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. రెండు భాషల్లో ఏకకాలంలో చేస్తే బాగుంటుందనుకున్నాం. కథ ఒకటే అయినా, ఆ యా భాషా చిత్రాల మార్కెట్‌ను బట్టి కథ ట్రీట్మెంట్ను మార్చాం. అలాగే, కామెడీ కోసం తమిళంలో సంతానం, తెలుగులో ‘సత్యం’ రాజేశ్‌లను పెట్టాం’’ అని వివరించారు. అయితే, ‘ఏం మాయ చేశావే’లో లాగా తెలుగు వెర్షన్‌కు ఒక క్లైమాక్స్, తమిళ వెర్షన్‌కు మరో క్లైమాక్స్ లాంటివి చేయలేదని ఆయన చెప్పారు. ముగ్గురు డెరైక్టర్ల మ్యూజిక్ మ్యాజిక్ ‘‘చక్కటి నేరేషన్ ఉన్న చాలా స్వీట్ అండ్ సింపుల్ సినిమా ఇది. ఫస్టాఫ్ మంచి లవ్‌స్టోరీలా నడుస్తుంది. సెకండాఫ్‌లో మంచి థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంటుంది’’ అని గౌతమ్ మీనన్ చెప్పారు. నితిన్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని, తమిళ వెర్షన్లో కన్నా తెలుగులో రొమాన్స్, ప్రేమ సన్నివేశాలకు ప్రాధాన్యమిచ్చారు. ‘‘అలాగే, నితిన్ మంచి డ్యాన్సర్ కాబట్టి, ఆ అంశాన్ని కూడా తెలుగులో వాడుకున్నాం. తమిళ హీరో జై కామెడీకి పెట్టింది పేరు కాబట్టి, ఆ వెర్షన్లో దానికి పెద్ద పీట వేశాం. సినిమా నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నా’’ అని గౌతమ్ మీనన్ అన్నారు. ప్రముఖ నేపథ్య గాయకుడు కార్తీక్ ఈ చిత్రంలో 3 పాటలకు బాణీలిస్తే, నితిన్ కోరిక మేరకు ఒక పాటకు అనూప్ రూబెన్స్ బాణీ కట్టారు. ఇక, సందీప్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. ‘‘నిజానికి, ఈ కథను ముగ్గురు నలుగురు హీరోలకు చెప్పాం. స్క్రిప్టు వినగానే నితిన్ చేద్దామన్నారు. ఇవాళ తమిళంతో పోలిస్తే, తెలుగు పెద్ద సినిమాగా అయింది’’ అని గౌతమ్ అభిప్రాయపడ్డారు. ఆ టైటిల్ నితిన్‌దే! త్వరలోనే మరో పెద్ద హీరో సినిమా హీరో పవన్‌కల్యాణ్ అభిమాని అయిన నితిన్ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ అనే టైటిల్ కూడా తానే సూచించారట. అలాగే, ఎప్పటిలానే ఈ సినిమాలోనూ తన అభిమాన హీరోను ఉద్దేశిస్తూ, ఒక డైలాగ్ కూడా చెప్పినట్లు గౌతమ్ మీనన్ తెలిపారు. ప్రస్తుతం నాగ చైతన్యతో తెలుగులో (ఇంకా టైటిల్ ఖరారు కాలేదు), శింబుతో తమిళం (‘అచ్చమ్ ఎన్బదు మడమయడా’)లో స్వీయ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 60 శాతం పూర్తయినట్లు ఆయన చెప్పారు. ఆ సినిమా కాగానే, త్వరలోనే ఒక పెద్ద హీరోతో సినిమాకు చేయడానికి అంతా సిద్ధం చేస్తున్నట్లు ఆయన వివరించారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి మాట్లాడుతూ, ‘‘ఇది కేవలం రెండు గంటల అయిదు నిమిషాల్లో చకచకా సాగే సినిమా. అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం. నితిన్ తండ్రి ఎన్. సుధాకరరెడ్డి సహకారంతో రిలీజ్ వ్యవహారాలన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పారు. మొత్తానికి, దాదాపు రెండేళ్ళ నుంచి వార్తల్లో నలుగుతూ వచ్చిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఎట్టకేలకు ప్రేక్షకులకు వినోదం డెలివరీ చేయడానికి రెడీ అయ్యాడన్న మాట! -
శ్రీవారి సన్నిధిలో హీరో నితిన్
-
ఆశిస్తే అందేది కాదది
ఆశిస్తే అందేది కాదు విజ యం అంటున్నారు యువ నటి యామి గౌతమ్. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ అంటూ పలు భాషల్లో హీరోయిన్గా ఒక్కో మెట్టు ఎదుగుతున్న ఈ బ్యూటీ తమిళం, తెలుగులో గౌర వం చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. తాజాగా మళ్లీ తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో తమిళ్ సెల్వనుమ్ తనియార్ అంజలుమ్ అనే పేరును తెలుగులో కొరియర్ భాయ్ కల్యాణ్ పేరును నిర్ణయించారు. ఈ చిత్రం పాట చిత్రీకరణ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా యామిగౌతమ్తో కొన్ని ముచ్చట్లు. గౌరవం చిత్రం ఆశించిన విజయం సాధించిందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ బదులిస్తూ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదన్నారు. అయితే మనకిచ్చిన పాత్రను న్యాయం చేసే ప్రయత్నం చేయాలన్నారు. తన తొలి చిత్రం విక్కిడోనర్ (హిందీ) మంచి చిత్రం అవుతుందని భావించాను గానీ అంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదన్నారు. అందుకే సక్సెస్ అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదన్నారు. ఉత్తరాది, దక్షిణాది చిత్రాలంటూ తేడాలు తనకు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో హిందీలో తెరకెక్కుతున్న కమర్షియల్ చిత్రం యాక్షన్ జాక్సన్, తమిళం, తెలుగు భాషల్లో తమిళ సెల్వన్ తనియార్ అంజలుమ్గా విడుదల కానుందన్నా రు. తాను మోడలింగ్ నుంచి వచ్చానని చెప్పారు. తొలి రోజుల్లోనే ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్‌తో కలసి పని చేయడం అదృష్టమన్నారు. ఏఆర్ రెహ్మాన్ రూపొం దించిన రౌనక్ వీడియో ఆల్బమ్‌లో నటించిన అనుభవాన్ని ఎప్పటికీ మరచిపోలేనని చెప్పారు.