కొరియర్ బోయ్ కళ్యాణ్ ట్రైలర్ విడుదల | nithin's courier boy kalyan trailer released | Sakshi
Sakshi News home page

కొరియర్ బోయ్ కళ్యాణ్ ట్రైలర్ విడుదల

Published Tue, Sep 8 2015 6:15 PM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM

కొరియర్ బోయ్ కళ్యాణ్ ట్రైలర్ విడుదల - Sakshi

కొరియర్ బోయ్ కళ్యాణ్ ట్రైలర్ విడుదల

ఒక వైపు నిర్మాతగా.. మరోవైపు హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు నితిన్. తాజా నితిన్ హీరోగా నటిస్తున్న 'కొరియర్ బోయ్ కళ్యాణ్' సినిమా ట్రైలర్ మంగళవారం సాయంత్రం విడుదలైంది. మహేశ్బాబు 'శ్రీమంతుడు' సినిమాతో స్ఫూర్తి పొందాడో ఏమో గానీ.. ఈ సినిమాలో నితిన్ కూడా సైకిల్ తొక్కాడు. హీరోయిన్ యామీ గౌతమ్ తన స్నేహితురాళ్లతో కలిసి ఆటోలో వెళ్తుండగా ఈ సైకిల్ తొక్కే సీన్ ఉంటుంది.

ఎంట్రీలో నితిన్ చేతిలో ఓ కవర్ పట్టుకుని పరుగు పెడుతూ కనిపిస్తాడు. అతడిని ఓ నలుగురు వెంబడిస్తారు. తర్వాత విదేశాల్లో ఆస్పత్రి కేంద్రంగా జరిగే అక్రమం, ఆ తర్వాత అవినీతిపై పోరాడుతున్నట్లుగా కనిపించే నాజర్, ఇలాంటి సన్నివేశాలన్నీ ఉంటాయి. ఈ సినిమాకు కార్తీక్, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రేమ్సాయి దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement