కొరియర్ బాయ్ పీకె | Courier Boy PK | Sakshi
Sakshi News home page

కొరియర్ బాయ్ పీకె

Published Mon, Aug 31 2015 11:42 PM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

కొరియర్ బాయ్ పీకె - Sakshi

కొరియర్ బాయ్ పీకె

అనగనగా ఓ కొరియర్ బాయ్. కరడు గట్టిన పవన్‌కల్యాణ్ వీరాభిమాని. తనను అందరూ పీకే అని పిలవాలని కోరుకుంటాడు. అందరూ అతన్ని పీకే అనే పిలుస్తుంటారు. కానీ వాళ్ల దృష్టిలో పీకే అంటే పని లేని కల్యాణ్ అని. ఫ్లాష్‌బ్యాక్‌లో అతనికున్న పేరు ప్రతిష్ఠలు అలాంటివి. కేవలం ఒక అమ్మాయి కోసం ఆ ఉద్యోగంలో చేరతాడు. ఇక  అక్కడి నుంచే అతనికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అతని జీవితాన్ని ఓ కొరియర్ కవర్ మలుపు తిప్పుతుంది.

అక్కడి నుంచి అతను ఎలాంటి సాహసాలు చేశాడనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’.  దర్శకుడు గౌతమ్‌మీనన్ సమర్పణలో   నితిన్, యామీ గౌతమ్ జంటగా వెంకట్ సోమసుందరం, రేష్మా ఘటాల, సునీత తాటి నిర్మించిన ఈ చిత్రానికి ప్రేమ్‌సాయి దర్శకుడు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదల కానుంది. గౌతమ్ మీనన్ మాట్లాడుతూ - ‘‘రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. ప్రేమ్‌సాయి బాగా తీర్చిదిద్దారు.

కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరినీ మెప్పించే సినిమా ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: సత్య పొన్‌మార్, రచనా సహకారం: కోన వెంకట్, హర్షవర్ధన్, ఎగ్జిక్యూటివ్  నిర్మాతలు: స్వాతి రఘురామన్, విజయ్ శంకర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement