
ఇటీవల బయోపిక్‌ల ట్రెండ్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలు చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖులందర్నీ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీరు బయోపిక్ చేయాలనుకుంటే ఏ సెలబ్రిటీని సెలెక్ట్ చేసుకుంటారు? అని బాలీవుడ్ భామ, ‘గౌరవం’ ఫేమ్ యామీ గౌతమ్‌ని అడిగితే –‘‘నాకు ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లాలా కనిపించాలనుంది. ఒకవేళ తన బయోపిక్ రూపొందిస్తే అందులో యాక్ట్ చేయాలనే ఆసక్తి ఉంది. అలాగే హీరోయిన్ మధుబాల బయోపిక్‌లోనూ యాక్ట్ చేయాలనే కల ఉంది. వీళ్లిద్దరే ఎందుకూ? అని అడిగితే సరైన సమాధానం నా దగ్గర లేదు. కానీ వాళ్ల ఫీల్డ్‌లో వాళ్లు చూపించిన ఇంపాక్ట్ చాలా గొప్పది. వెరీ ఇన్‌స్పిరేషనల్’’ అని సమాధానమిచ్చారు యామీ.
Comments
Please login to add a commentAdd a comment