Astronaut Kalpana Chawla
-
నాసా స్పేస్ క్రాఫ్ట్‌కు భారత వ్యోమగామి పేరు!
వాషింగ్టన్: దివంగత నాసా వ్యోమగామి కల్పనా చావ్లాకు నివాళి అర్పించేందుకు అమెరికన్ వాణిజ్య కార్గో అంతరిక్ష నౌకకు ఆమె పేరును పెట్టింది. మానవ అంతరిక్ష ప్రయాణానికి ఆమె చేసిన కృషికి గాను ఈ విధంగా నివాళులు అర్పించారు. భారతదేశం నుంచి అంతరిక్షంలోకి ప్రవేశించిన మొదటి మహిళ కల్పనా చావ్లా. అమెరికన్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ నార్త్రోప్ గ్రుమ్మన్ దాని తదుపరి సిగ్నస్ క్యాప్సూల్‌కు ‘ఎస్ఎస్ కల్పనా చావ్లా’ అని పేరు పెట్టనున్నట్లు ప్రకటన చేసింది. 2003లో ఆరుగురు సభ్యులతో ప్రయాణిస్తున్న కొలంబియా అనేక నౌక కుప్పకూలడంతో కల్పనా చావ్లా మరణించింది. "నాసాలో పనిచేస్తూ భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లాను ఈ రోజు మనం గౌరవిస్తున్నాం. మానవ అంతరిక్ష ప్రయాణానికి ఆమె చేసిన కృషి శాశ్వత ప్రభావాన్ని చూపింది" అని కంపెనీ బుధవారం ట్వీట్లో తెలిపింది. కొలంబియాలో ఆన్‌బోర్డ్‌లో ఆమె చేసిన చివరి పరిశోధన అంతరిక్ష ప్రయాణ సమయంలో వ్యోమగామి ఆరోగ్యం, భద్రతను అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడింది. కల్పన చావ్లా జీవితాన్ని, అంతరిక్షంలో ప్రయాణించాలనే ఆమె కలని నార్త్రోప్ గ్రుమ్మన్ ఈ సందర్భంగా జరుపుకోవడం మాకు గర్వంగా వుంది’ అని ఈ సంస్థ తెలిపింది. చదవండి: నాసా, స్పేస్ ఎక్స్ మరో అద్భుత విజయం -
కల్పనలా కనిపించాలనుంది
ఇటీవల బయోపిక్‌ల ట్రెండ్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలు చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖులందర్నీ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీరు బయోపిక్ చేయాలనుకుంటే ఏ సెలబ్రిటీని సెలెక్ట్ చేసుకుంటారు? అని బాలీవుడ్ భామ, ‘గౌరవం’ ఫేమ్ యామీ గౌతమ్‌ని అడిగితే –‘‘నాకు ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లాలా కనిపించాలనుంది. ఒకవేళ తన బయోపిక్ రూపొందిస్తే అందులో యాక్ట్ చేయాలనే ఆసక్తి ఉంది. అలాగే హీరోయిన్ మధుబాల బయోపిక్‌లోనూ యాక్ట్ చేయాలనే కల ఉంది. వీళ్లిద్దరే ఎందుకూ? అని అడిగితే సరైన సమాధానం నా దగ్గర లేదు. కానీ వాళ్ల ఫీల్డ్‌లో వాళ్లు చూపించిన ఇంపాక్ట్ చాలా గొప్పది. వెరీ ఇన్స్పిరేషనల్’’ అని సమాధానమిచ్చారు యామీ. -
కల్పనా చావ్లా స్ఫూర్తి ప్రదాత: హారిసన్
వాషింగ్టన్: స్పేస్ షటిల్ కొలంబియా ప్రమాదంలో దుర్మరణం పాలైన కల్పనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్‌లోని ఆర్లింగ్టన్ సిమెట్రీలో శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కల్పన భర్త జీన్ పియరీ హారిసన్‌ను అక్కడి అధికారులు మోదీకి పరిచయం చేశారు. ఈ సందర్భంగా జీన్ మాట్లాడుతూ కల్పనా చావ్లా మదిలో ఏది మెదిలినా సరే దానిని సాధించే వరకు పట్టు విడవదని, గొప్ప పోరాట యోధురాలు, స్పూర్తి ప్రదాత అని అన్నారు. అలాగే కల్పన జీవిత చరిత్ర పుస్తకాలు రెండింటిని ఆయన ప్రధాని మోదికి బహూకరించారు. ఈ సందర్భంగా మరో వ్యోమగామి, కల్పన ఫ్రెండ్ సునితా విలియమ్స్, ఆమె తండ్రిని ఇండియాకు రావలసిందిగా ప్రధాని మోది ఆహ్వానించారు.