వాషింగ్టన్: స్పేస్ షటిల్ కొలంబియా ప్రమాదంలో దుర్మరణం పాలైన కల్పనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్‌లోని ఆర్లింగ్టన్ సిమెట్రీలో శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కల్పన భర్త జీన్ పియరీ హారిసన్‌ను అక్కడి అధికారులు మోదీకి పరిచయం చేశారు.
ఈ సందర్భంగా జీన్ మాట్లాడుతూ కల్పనా చావ్లా మదిలో ఏది మెదిలినా సరే దానిని సాధించే వరకు పట్టు విడవదని, గొప్ప పోరాట యోధురాలు, స్పూర్తి ప్రదాత అని అన్నారు. అలాగే కల్పన జీవిత చరిత్ర పుస్తకాలు రెండింటిని ఆయన ప్రధాని మోదికి బహూకరించారు. ఈ సందర్భంగా మరో వ్యోమగామి, కల్పన ఫ్రెండ్ సునితా విలియమ్స్, ఆమె తండ్రిని ఇండియాకు రావలసిందిగా ప్రధాని మోది ఆహ్వానించారు.