కొత్త ప్రేమికుడితో యామీ | Yami Gautam and Pulkit Samrat more than just friends? | Sakshi
Sakshi News home page

కొత్త ప్రేమికుడితో యామీ

Published Wed, Dec 2 2015 3:00 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

కొత్త ప్రేమికుడితో యామీ - Sakshi

కొత్త ప్రేమికుడితో యామీ

యామీగౌతమ్ ఇప్పుడు నిత్యం వార్తల్లో నటిగా సంచలనం సృష్టిస్తోంది. ఏదో విధంగా హీరోయిన్‌గా ఎదగాలన్నదే తన ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తోందని సినీ వర్గాలంటున్నాయి. తమిళంలో గౌరవం చిత్రం ద్వారా నాయకిగా ఎంట్రీ ఇచ్చిన యామీగౌతమ్ మొదట్లో తాను గ్లామర్‌కు దూరంలాంటి స్టేట్‌మెంట్లతో తెగ ప్రచారం చేసుకుంది. అదే ఈ అమ్మడికి శాపం అయ్యింది. ఇక్కడ అవకాశాలు అడుగంటడంతో టాలీవుడ్‌పై కన్నేసింది. అక్కడ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రస్తుతం బాలీవుడ్‌నే నమ్ముకుంది.

అక్కడ అవకాశాలను రాబట్టుకోవడానికి యామీ పడరాని పాట్లు పడుతోందట. ఒక పక్క వాణిజ్య ప్రకటనలతో గడిపేస్తూ, తాను అందాలారబోతకు రెడీ అంటూ ప్రత్యేకంగా ఫొటో సెషన్ చేయించుకున్న గ్లామర్ ఫొటోలను ఇంటర్నెట్‌లో విడుదల చేసి సంచలనం సృష్టించింది. అయితే ఆ ఫొటోలు కాస్త దుమారానికే పరిమితం అయ్యాయి గానీ అమ్మడికి అవకాశాలను తెచ్చిపెట్టలేదు. ఇప్పటికే పలు వదంతుల పైనపడగా తాజాగా కొత్త లవర్‌తో చెట్టాపట్టాల్ అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం దుమ్మురేపుతోంది.

యువ నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో యామీగౌతమ్ పార్టీలు, పబ్‌లు అంటూ యమ జోరుగా షికార్లు చేస్తోందట. దీని గురించి మీడియా గగ్గోలు పెడుతున్నా డోంట్ కేర్ అంటూ ఎలాంటి ప్రచారంతో నైనా అవకాశాలు రాబట్టుకుని నటిగా ఎదగాలనే తన గోల్‌ను రీచ్ అవ్వాలని చూస్తోందట. ఇంతకీ తన తాజా లవర్ పుల్కిత్ సామ్రాట్ ఎవరో తెలుసా? నటుడు సల్మాన్ ఖాన్ చెల్లెలి భర్త.

గత ఏడాదే సల్మాన్‌ఖాన్ తన చెల్లెలు శ్వేతా రోహిరా పెళ్లిని ఘనంగా చేశారు. అయితే ఇప్పుడు పుల్కిత్ సామ్రాట్ శ్వేతా రోహిరాల మధ్య మనస్పర్థలు దూరాన్ని పెంచాయట. అందుకు నటి యామీ గౌతమ్ కూడా ఒక కారణం అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement