
నూతన వధువు యామీ గౌతమ్ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను వరుసగా షేర్ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తోంది. ఈ ఫొటోల్లో సాంప్రదాయ దుస్తుల్లో హీరోయిన్ ధగధగ మెరిసిపోతోందంటూ ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. వారు మాత్రమే కాదు, ఈ ఫొటోలను చూసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సహా పలువురు సెలబ్రిటీలు సైతం యామీ సూపర్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
వైరలవుతున్న యామీ గౌతమ్ పెళ్లి ఫోటోలు
ఆయుష్మాన్ ఖురానా కూడా యామీ ఎంతో సింపుల్‌గా రెడీ అయిందంటూ కామెంట్లు చేశాడు. ఇది చూసిన కంగనా.. ఒక విషయాన్ని సింపుల్ అని నిర్ధారించడం ఎంత కష్టమో తెలుసా? అంటూ ఆయుష్మాన్‌కు గట్టిగానే క్లాస్ పీకింది. ఇక యామీని అచ్చం రాధేమాలా ఉందన్న విక్రాంత్ మాస్సేకు సైతం స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. 'ఈ బొద్దింక ఎక్కడ నుంచి వచ్చింది? నా చెప్పులు తీసుకురండి, దీని సంగతి చూస్తా' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇదిలా వుంటే యామీ గౌతమ్, 'ఉరి' డైరెక్టర్ ఆదిత్యను శుక్రవారం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ పెళ్లి వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment