
నవంబర్ 28న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
యామీ గౌతమ్ (నటి)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఈ సంవత్సరం వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం ఆరంభించిన ప్రాజెక్టుల నుంచి లాభాలు కళ్లజూస్తారు. పోటీపరీక్షలలో విజేతలై జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం బాగుంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వ్యతిరేకులు సైతం మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. విద్యార్థులకు విదేశాలలో చదువుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. వీరు పుట్టిన తేదీ 28. ఇది సూర్యునికి సంబంధించినది. దీనివల్ల న్యాయసంబంధమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో జాగ్రత్త విహ ంచాలి. వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగులు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మాని, ఉన్న ఉద్యోగాన్ని శ్రద్ధగా చేసుకోవడం మంచిది.
లక్కీ నంబర్స్:1, 2,5,6,7,9; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్, రోజ్, ఆరెంజ్, గ్రే; లక్కీ డేస్: ఆది, సోమ, శుక్ర, శనివారాలు
సూచనలు: రోజూ రాత్రిపూట కనీసం ఒక అరగంటపాటు వెన్నెలలో విహరించడం, నవగ్రహాభిషేకం, సూర్యాష్టకం పఠించడం, దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్