నోరూరించే యామీ గౌతమ్‌ వంటకాలివే.. | Yami Gautam Shares Cooked Food Items | Sakshi
Sakshi News home page

నోరూరించే యామీ గౌతమ్‌ వంటకాలివే..

Published Sun, Aug 30 2020 6:13 PM | Last Updated on Sun, Aug 30 2020 6:47 PM

Yami Gautam Shares Cooked Food Items - Sakshi

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటి యామీ గౌతమ్‌ సోషల్‌ మీడియాలో తన అభిరుచులను పంచుకుంటు నెటిజన్లను అలరిస్తుంటారు. కాగా తాజాగా యామీ గౌతమ్‌కు ఆహారం అంటే ఎంతో ఇష్టమొ, ఆమె వండిన బేకరీ పదర్థాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్‌ చేసింది. ప్రపంచ బేకింగ్‌ డే సందర్భంగా యామీ తానే స్వయంగా వండిన కొన్ని ఆహార వంటకాలను పోస్ట్‌ చేసింది. తాను బేకరి వంటకాలను అద్భుతంగా చేయగలనని తెలిపింది. మరోవైపు బేకరి పదార్థాలను తయారు చేసే నిర్వాహకులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అయితే నోరూరించే ‘పహాజి రజ్మా’ తనకు ఇష్టమైన వంటకమని అందుకు స్వయంగా వండినట్లు యామీ పేర్కొంది.

కాగా తన తల్లికి ఇష్టమైన ‘పహారీ దామ్’‌ వంటకాన్ని సైతం వండినట్లు పేర్కొంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరు ఇంట్లో ఉండి వంటకాలను నేర్చుకోవచ్చని నెటిజన్లకు, అభిమానులకు సూచించింది. కరోనా నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా ఇంట్లో ఉండడండి(స్టే హోమ్‌), జాగ్రత్తగా ఉండడండి(స్టే సేఫ్‌) అని ప్రజలను కోరింది. యామీ గౌతమ్‌ 2019లో బాలా చిత్రంలో నటించింది. ప్రస్తుతం గిన్నీ వెడ్స్‌ సన్నీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement