హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సు
Published Wed, Jun 28 2017 3:43 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్‌సీఈపీ) అంతర్జాతీయ సదస్సుకు ఈ సారి హైదరాబాద్ వేదికకానుంది. భారత్, ఆస్ట్రేలియా, చైనా తదితర 16 దేశాలకు చెందిన సుమారు 700 మంది అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. జూలై 24వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో వాణిజ్య, పరరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు.
ఆర్‌సీఈపీలో ఉన్న మొత్తం 16 సభ్య దేశాల ప్రతినిధులు తమ మధ్య వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను పెంచే మార్గాలను చర్చిస్తారు. సభ్య దేశాల మధ్య జరిగే వాణిజ్యం పెంపునకు వస్తువులపై పన్నులను ఎత్తియడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. ఆర్‌సీఈపీ ప్రథమ సదస్సు 2012లో కాంబోడియాలో, గత ఏడాది ఫిలిప్పీన్స్‌లో జరిగాయి. ఈ ఏడాది సదస్సుతో చర్చలు ముగింపునకు రావచ్చని భావిస్తున్నారు.
Advertisement
Advertisement