వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం చోటుచేసుకునే అవకాశం లేదు. భారత్‌తో ట్రేడ్ డీల్‌పై ట్రంప్ విస్పష్ట సంకేతాలు పంపారు. భారత్‌తో భారీ డీల్‌ను తాను దాచుకుంటానని, నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లోగా ఈ ఒప్పందం ఖరారవుతుందనే విషయం తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌తో తాము వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని, అయితే ఈ మెగా డీల్‌కు మరికొంత కాలం వేచిచూస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
భారత్‌తో భారీ ఒప్పందం పట్ల తాము ఆసక్తిగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల ప్రకారం చూస్తే ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ట్రేడ్ డీల్ ప్రకటన వెలువడే అవకాశం లేనట్టే. మరోవైపు భారత్‌తో వాణిజ్య ఒప్పందం చర్చల్లో కీలక పాత్ర పోషించిన అమెరికా ట్రేడ్ ప్రతినిధి రాబర్ట్ లిజర్ ట్రంప్‌తో పాటు భారత పర్యటనకు వచ్చే బృందంలో లేకపోవడం గమనార్హం. మరోవైపు ఈ పర్యటనలో ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేమని కూడా వైట్‌హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment