jakhau coast
-
మహోగ్రరూపం దాల్చిన బిపర్జోయ్ తుపాను..(ఫొటోలు)
-
దూసుకొస్తున్న బిపర్జోయ్..
-
అల్ల కల్లోలంగా మారిన తుపాన్.. గుజరాత్లో హై అలర్ట్
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: అత్యంత తీవ్రంగా మారిన బిపర్జోయ్ తుపాను ఈ నెల 15న గుజరాత్‌లోని జఖౌ పోర్టు వద్ద తీరాన్ని తాకనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. అరేబియా సముద్ర తీర ప్రాంత జిల్లాలైన కచ్, పోరుబందర్, ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, మోర్బిల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. ‘ 15వ తేదీ మధ్యాహ్నానికి బిపర్జోయ్ తుపాను జఖౌ పోర్టు వద్ద తీరాన్ని తాకే అవకాశాలున్నాయి. ఆ సమయంలో గంటకు గరిష్టంగా దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. అతి భారీ వర్షాలు కురుస్తాయి’అని గుజరాత్‌లోని ఐఎండీ కేంద్రం డైరెక్టర్ మనోరమ మహంతి చెప్పారు. ఈ నెల 15, 16 తేదీల్లో సౌరాష్ట్ర–కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను ఎగురవేయడంతోపాటు 16వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. గుజరాత్లో పాఠశాలలకు ఈనెల 15 వరకు సెలవులు ప్రకటించారు. సుమారు 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కచ్–సౌరాష్ట్ర జిల్లాల్లో తీరానికి 10 కిలోమీటర్లలోపు దూరంలోని గ్రామాల వారిని మంగళవారం నుంచి తరలిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉండే సుమారు 10 వేల మందిని తాత్కాలిక షెల్టర్లలో ఉంచుతామని కచ్ కలెక్టర్ అమిత్ అరోరా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 12 బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. తక్షణమే చర్యలు తీసుకోండి: ప్రధాని తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు. సోమవారం ఆయన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘తుపాను ప్రభావంతో విద్యుత్, టెలీకమ్యూనికేషన్స్, ఆరోగ్యం, తాగునీరు వంటి అత్యవసర సౌకర్యాలకు ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే పునరుద్ధరించాలని ప్రధాని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తెలిపింది. ఇందుకు గాను కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కోరారని తెలిపింది. తపానుతో ఉత్పన్నమైన పరిస్థితులను తెలుసుకునేందుకు హోం శాఖ రాష్ట్ర యంత్రాంగంతో నిరంతరం టచ్‌లో ఉంటుందని పీఎంవో వివరించింది. ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షా, ఐఎండీ డీజీ మృత్యుంజయ్ తదితరులు హాజరయ్యారు. -
8 మంది పాకిస్తానీలు.. 30 కేజీల హెరాయిన్
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని జఖావు తీరంలో ఒక ఫిషింగ్ బోట్లో 8 మంది పాకిస్తానీలను, 30 కేజీల హెరాయిన్‌ను భారత తీర రక్షణ దళం పట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన బోటు నిషేధిత డ్రగ్స్‌తో భారత సముద్ర జలాల్లోకి వచ్చిందన్న సమాచారంతో ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ), గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆ బోటు నుంచి రూ. 150 కోట్ల విలువైన 30 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఐసీజీ ప్రకటించింది. గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళానికి వారిని అప్పగించినట్లు తెలిపింది. హెరాయిన్‌ను గుజరాత్ నుంచి పంజాబ్‌కు రోడ్డు మార్గంలో తరలించాలన్నది వారి పన్నాగమని పేర్కొంది. ఏడాదిలో స్మగ్లర్ల నుంచి రూ. 5,200 కోట్ల విలువైన 1.6 టన్నుల డ్రగ్స్‌ను ఐసీజీ స్వాధీనం చేసుకుంది. -
పాక్ అదుపులో 100మంది ఇండియన్స్
అహ్మదాబాద్: వందమంది భారతీయులను పాకిస్థాన్ బందించింది. తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని కారణంతో దాదాపు 100మందిని, 18 బోట్లను అదుపులోకి తీసుకుంది. గుజరాత్‌లోని కచ్ జిల్లా పరిధిలోగల జకావ్ సముద్ర తీర ప్రాంతంలోకి చేపల వేటకు వెళ్లిన మత్యకారులను తమ ప్రాంతంలోకి అక్రమంగా వచ్చారంటూ పాకిస్థాన్ సముద్ర తీర ప్రాంత గస్తీ దళం అదుపులోకి తీసుకుంది. ‘100మంది మత్స్యకారులను 18 చేపల పడవలను పాకిస్ధాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఎజెన్సీ(పీఎంఎస్ఏ) తమ ఆధీనంలోకి తీసుకుందని మాకు సమాచారం ఉంది’ అని నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరమ్(ఎన్ఎఫ్ఎఫ్) కార్యదర్శి మనీశ్ లోధారి చెప్పారు. ఈ విషయాన్ని వారి నుంచి తప్పించుకున్న కొంతమంది మత్స్యకారులు తమతో చెప్పారని అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అలాగే, అసలు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారనే విషయంపై కూడా ఆరాతీస్తున్నట్లు తెలిపారు.