అహ్మదాబాద్: వందమంది భారతీయులను పాకిస్థాన్ బందించింది. తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని కారణంతో దాదాపు 100మందిని, 18 బోట్లను అదుపులోకి తీసుకుంది. గుజరాత్‌లోని కచ్ జిల్లా పరిధిలోగల జకావ్ సముద్ర తీర ప్రాంతంలోకి చేపల వేటకు వెళ్లిన మత్యకారులను తమ ప్రాంతంలోకి అక్రమంగా వచ్చారంటూ పాకిస్థాన్ సముద్ర తీర ప్రాంత గస్తీ దళం అదుపులోకి తీసుకుంది.
‘100మంది మత్స్యకారులను 18 చేపల పడవలను పాకిస్ధాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఎజెన్సీ(పీఎంఎస్‌ఏ) తమ ఆధీనంలోకి తీసుకుందని మాకు సమాచారం ఉంది’ అని నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరమ్(ఎన్‌ఎఫ్‌ఎఫ్) కార్యదర్శి మనీశ్ లోధారి చెప్పారు. ఈ విషయాన్ని వారి నుంచి తప్పించుకున్న కొంతమంది మత్స్యకారులు తమతో చెప్పారని అన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ అధికారులతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అలాగే, అసలు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారనే విషయంపై కూడా ఆరాతీస్తున్నట్లు తెలిపారు.
పాక్ అదుపులో 100మంది ఇండియన్స్
Published Mon, Mar 27 2017 9:55 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
Advertisement